Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ. 19 కోట్ల పన్ను బకాయిలు: ఆంధ్రా పేపర్ మిల్స్ పై పవన్ ఆగ్రహం!

రూ. 19 కోట్ల పన్ను బకాయిలు: ఆంధ్రా పేపర్ మిల్స్ పై పవన్ ఆగ్రహం!

వార్త 5 months ago

Pawan kalyan:పరిశ్రమలు పంచాయతీలకు పన్ను చెల్లించకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు సంపాదించే పరిశ్రమలు పన్నులు చెల్లించకపోతే ఎలాగని అధికారులను ప్రశ్నించారు.

గ్రామాల్లో వనరులు వాడుకుంటూ పన్నులు కట్టకపోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆంధ్రా పేపర్ మిల్స్ రూ.19 కోట్లు బకాయిలు పెట్టిందని గుర్తు చేశారు. విద్యాసంస్థలు కూడా భారీగా పన్ను బకాయిలున్నాయన్నారు. రాష్ట్రంలో పంచాయతీ పన్నులు వసూలైతే రూ.5,400 కోట్ల కుపైగా వస్తాయని వివరించారు. పంచా యతీ రాజ్శాఖ అధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల పన్నుల వసూళ్లపై అధికారులతో సమీక్షించారు. పరిశ్రమలు, ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి పన్ను వసూళ్లు ఎందుకు సరిగా ఉండటం లేదని అధికారులను అడిగారు. రాజధాని నుంచి ఉన్నతాధికారులతో కలిసి పవన్ నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అధికారులు ఆన్లైన్లో పాల్గొన్నారు. తమ ప్రాం తాల్లో పన్ను వసూళ్లు వివరాలను పంచుకున్నారు.

Read also: AP Local Body Elections : ఏపీలో 'స్థానిక' ఎన్నికల హీట్ మొదలు !!

 pawan kalyan monitoring panchayat tax

పన్నులు చెల్లించని కారణంగా ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు కూడా ఇబ్బందులు తలెత్తాయన్నారు. పేదలు, కులవృత్తులవారు, చిరు ద్యోగులు కూడా పన్నులు చెల్లిస్తున్నారన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు పన్నులు కట్టని విషయం ప్రజలకు తెలియదన్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా పన్నుల విషయంలో ముందుకెళ్లాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సీఎంతో పాటు మంత్రివర్గంతోనూ మాట్లాడతానని పవన్ అధికారులతో చెప్పారు. పల్స్ సర్వే తరహాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్నుల వసూళ్ల కార్యాచరణ చేపటాలని అధికార యంత్రాంగానికి ఈ సందర్భంగా పవన్ దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఏపీ అత్యుత్తమ పనితీరు కనబరిచిందన్నారు. మొత్తం ఆరు అవార్థులు సాధించిన కర్ణాటక రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఐదు అవార్డులు సాధించిన ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని దక్కించుకుందన్నారు. ఒడిశా రాష్ట్రం కూడా ఐదు అవార్డులతో ఏపీతో పాటు సంయుక్తంగా రెండో స్థానాన్ని పంచుకుందన్నరు.

pawan kalyan:పరిశ్రమలు, విద్యాసంస్థల బాధ్యత

మరింత కృషి చేస్తే మెదటి స్థానంలోకి వస్తామన్నారు. ఇక దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పురస్కార్ కింద దేశవ్యాప్తంగా మొత్తం 34 గ్రామ పంచాయతీలకు కేంద్రం ర్యాంకులు ఇచ్చింది. వీటికి రూ.25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు నగదు బహుమతులు అందుతాయి. అలాగే, నానాజీ దేశ్ ముఖ్ పురస్కార్ కింద దేశవ్యాప్తంగా 8 బ్లాక్ పంచాయతీలను ఎంపిక చేసి, రూ. 50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు నగదు ఇవ్వనున్నారు. ఈ జాతీయ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని వచ్చే నెల (జూన్) 3వ తేదీన దేశ రాజధాని దిల్లీలో అట్టహాసంగా నిర్వహించనున్నారు. అవార్డులు సాధించిన పల్లెల సర్పంచులు, అధికారులు ఆ వేదికపై ఈ పురస్కారాలను అందుకోనున్నారు.చెట్టినాడ్ సిమెంట్స్ పన్ను వసూళ్లలో అవకతవకలపై తక్షణ చర్యలు: సమావేశంలో పవన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పంచాయతీలు బాగుపడాలి.. నాలుగు గ్రేడ్లకు డిఫరెంట్ స్లాబ్స్ తో టాక్సులు నిర్ధారించండి. విద్యాసంస్థలకు కూడా కోర్టుకి ఎలా వెళ్తారు.. ఉచితంగా విద్యను అందిస్తూ ఇన్సెంటివ్స్ ఇవ్వమంటే అర్థం ఉంటుంది..

ప్రభుత్వ స్పష్టమైన కార్యాచరణ

లక్షలకి లక్షలు ఫీజులు తీసుకుని పన్ను కట్టకుండా ఉంటే ఎలా? ప్రజలకి ఏం సమాధానం చెబుతాం. వారిని వదిలేసి మమ్మల్ని పీడిస్తున్నారని ప్రజలు అంటే ప్రభుత్వానికి చెడ్డపేరు. గత 30 ఏళ్లలో పంచాయతీల ఆస్తులు ఎన్ని అన్యాక్రాంతం అయ్యాయనే అంశంపై కూడా సమగ్ర నివేదిక ఇవ్వండి. పన్ను చెల్లింపుల వ్యవహారంలో మినహాయింపులు ఇవ్వాల్సి ఉంటే వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పన్నుల వసూళ్లలో అవకతవకలు సహించం. తాళ్లపాలెం, చెట్టినాడ్ సిమెంట్స్ నుంచి పన్ను వసూలు చేయని పంచాయతీ కార్య దర్శిపై తక్షణం చర్యలు తీసుకోవాలి. పన్ను చెల్లింపుల్లో అవకతవకల్ని ఉపేక్షించవద్దు. పెద్ద పెద్ద పరిశ్రమల నుంచి పన్నులు వసూలు కాని జాబితా సిద్ధం చేసి, ఎందుకు వసూలు కావడం లేదు అనే వివరాలు సమర్పించండి పంచాయతీల్లో సొంత ఆదాయ వనరులు పెంచుకోవాలి. అందుకోసం కలప ఇచ్చే మొక్కలు ప్రతి పంచాయతీలో 2 వేలు నాటాలి. దీని కోసం పంచాయతీరాజ్, అటవీశాఖల మధ్య పరస్పర ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో పంచాయతీలకు చేరతాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త.. రిటైర్మెంట్ వయసు పెంపు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha