Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం మాజీ సైనికుడిని చంపిన భార్య!

రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం మాజీ సైనికుడిని చంపిన భార్య!

వార్త 2 weeks ago

Karnataka Ex Army Murder: డబ్బుపై అత్యాశ, వివాహేతర సంబంధం కలిసి ఒక ఆర్మీ మాజీ జవానును అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్న ఘోర కలియుగ ఘటన కర్ణాటకలో కలకలం రేపింది.

రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ (Life Insurance) పాలసీ సొమ్మును కాజేయడానికి, ఒక భార్య తన ప్రియుడితో కలిసి కన్నబిడ్డల తండ్రిని, దేశాన్ని కాపాడిన మాజీ సైనికుడిని ఆసుపత్రి బెడ్‌పైనే సెలైన్‌లో విషం కలిపి హతమార్చింది. సంచలనం సృష్టించిన ఈ ‘సెలైన్ మర్డర్’ మిస్టరీని కర్ణాటకలోని బెళగావి జిల్లా యమకనమరడి పోలీసులు ఛేదించారు. ఈ దారుణంలో భార్య, ఆమె ప్రియుడితో పాటు వారికి సహకరించిన ప్రభుత్వ ల్యాబ్ అధికారులు, నకిలీ డాక్టర్ సహా మొత్తం తొమ్మిది మందిని (9 Members) అరెస్టు చేసినట్లు బెళగావి ఎస్పీ భీమా శంకర గుళేద్‌ అధికారికంగా వెల్లడించారు.

Read Also :Bengaluru Crime: ప్రియురాలి గొంతుకోసి చంపేసిన ప్రియుడు.. పెళ్లి వివాదమే కారణమా?

రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటుండగా.. సెలైన్‌లో విషం!

మృతుడు సందీప్‌ కలగౌడ మంజరగి (46) ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన మాజీ సైనికుడు. ఆయన భార్య సుమకు పుండలీక డొంబర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. సందీప్ పేరు మీద రూ. 2 కోట్ల భారీ ఇన్సూరెన్స్ అమౌంట్ ఉండటంతో, అతడిని వదిలించుకుంటే డబ్బుతో పాటు తామిద్దరం హ్యాపీగా ఉండొచ్చని సుమ-పుండలీక స్కెచ్ వేశారు. మార్చి 13న సందీప్‌ మంజరగి ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి హుక్కేరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రమాదం చిన్నదే కావడంతో ఆయన కోలుకుంటున్నారు. ఇదే తమకు సరైన అవకాశమని భావించిన భార్య సుమ, ప్రియుడు పుండలీకలు ఆసుపత్రి సిబ్బంది కళ్లుగప్పి మార్చి 15న సందీప్‌కు ఎక్కుతున్న సెలైన్‌ బాటిల్‌లో తీవ్రమైన విషాన్ని ఇంజెక్ట్ చేశారు. దాంతో కొద్దిసేపటికే సందీప్ ప్రాణాలు విడిచాడు. రోడ్డు ప్రమాదంలో తగిలిన గాయాల వల్లే సందీప్ చనిపోయాడని నమ్మించి, హడావుడిగా అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే, సందీప్ మరణంపై అతని సోదరుడికి బలమైన అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Karnataka Ex Army Murder: విచారణలో వెలుగుచూసిన నకిలీ డాక్టర్లు, ల్యాబ్ అధికారుల బాగోతం!

పోలీసులు మొదట భార్య సుమ, ప్రియుడు పుండలీకలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నారు. అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం వీరు మెడికల్ రిపోర్టులను, ఫోరెన్సిక్ రిపోర్టులను తారుమారు చేసేందుకు ఏకంగా ప్రభుత్వ అధికారులను లంచాలతో లోబరుచుకున్నట్లు విచారణలో తేలింది.

పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల ముఠా వివరాలు

  1. సుమ (మృతుడి భార్య – ప్రధాన నిందితురాలు)
  2. పుండలీక డొంబర్ (సుమ ప్రియుడు – హత్యకు ప్లాన్ చేసినవాడు)
  3. బసవరాజ భస్మె (ఆర్‌ఎంపీ నకిలీ వైద్యుడు)
  4. అశోక గుజనాళ (బెళగావి కమిషనర్‌ కార్యాలయం ఎఫ్‌డీఏ)
  5. అప్పాసాహెబ నాయక (ఫోరెన్సిక్‌ ప్రయోగశాల క్లర్క్)
  6. అడవి స్వామిమఠ (ల్యాబ్ అసిస్టెంట్‌)
  7. పీఎన్‌ నాగరాజ్ (సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్)
  8. సేలార (పుండలీక స్నేహితుడు)
  9. రాహుల్ జోగి (పుండలీక స్నేహితుడు)

పోస్ట్‌మార్టం రిపోర్టులో విషం అనే విషయం బయటకు రాకుండా ఉండేందుకు, ల్యాబ్ టెస్టులను తప్పుదోవ పట్టించేందుకు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు, క్లర్కులు నిందితుల నుంచి భారీగా డబ్బులు తీసుకుని తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఇన్‌స్టాగ్రామ్‌లో సంచిత ఉగాలే చివరి వీడియో.. అంతలోనే ఏం జరిగింది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha