Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ. 9,999లకే 5G స్మార్ట్‌ఫోన్: 'బోల్ట్' సిరీస్‌తో ఫైర్-బోల్ట్ గ్రాండ్ ఎంట్రీ!

రూ. 9,999లకే 5G స్మార్ట్‌ఫోన్: 'బోల్ట్' సిరీస్‌తో ఫైర్-బోల్ట్ గ్రాండ్ ఎంట్రీ!

వార్త 3 weeks ago

Flipkart Sale: ప్రసిద్ధ వేరబుల్స్ బ్రాండ్ ఫైర్-బోల్ట్ (Fire-Boltt) కొత్తగా స్మార్ట్‌ఫోన్ రంగానికి శ్రీకారం చుట్టింది. 'బోల్ట్' సిరీస్ పేరిట బోల్ట్ ఈవో 4జీ (Boltt Evo 4G) మరియు బోల్ట్ ఏస్ 5జీ (Boltt Ace 5G) మోడళ్లను భారత మార్కెట్లో ఆవిష్కరించింది.

ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్న ఈ ఫోన్లు బడ్జెట్ ధరలోనే అధునాతన ఫీచర్లను అందిస్తున్నాయి.

Read Also:AP Industrial Parks: కేంద్ర పథకంతో ఏపీలో పరిశ్రమల జోరు

ప్రధాన స్పెసిఫికేషన్లు & ఫీచర్లు

  • డిస్‌ప్లే: 6.79 అంగుళాల HD+ డిస్‌ప్లే (120Hz రిఫ్రెష్ రేట్)
  • బ్యాటరీ & ఛార్జింగ్: 6,000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • కెమెరా వ్యవస్థ:
    • బోల్ట్ ఏస్ 5జీ: 64MP ప్రధాన కెమెరా
    • బోల్ట్ ఈవో 4జీ: 50MP ప్రధాన కెమెరా
  • సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 16 వర్షన్

Flipkart Sale: ధర & ఆఫర్ వివరాలు

  • ప్రారంభ ధర: రూ. 10,999
  • సేల్ ప్రారంభం: సెప్టెంబర్ 1 నుండి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
  • ల్యాంచింగ్ ఆఫర్: ప్రారంభ ఆఫర్ కింద రూ. 1,000 తక్షణ డిస్కౌంట్ లభించనుంది. దీని ద్వారా రూ. 9,999లకే 5G స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

రూ. 10,000 బడ్జెట్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 6000mAh బ్యాటరీ మరియు 5G కనెక్టివిటీ కోరుకునే వారికి ఈ ఫోన్ మంచి ఎంపికగా మారనుంది.

Epaper: epaper.vaartha.com

సెప్టెంబర్ లో బ్యాంకులకు 16 రోజుల సెలవులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha