Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.10కి పడిపోయిన టమాట ధరలు

రూ.10కి పడిపోయిన టమాట ధరలు

వార్త 1 week ago

Tomato prices drop:తెలుగు రాష్ట్రాల్లో టమోటా సాగు చేసిన రైతులకు ఈసారి ఆరంభంలోనే తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ఎన్నో ఆశలతో కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి మార్కెట్లో టమాట ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

గతేడాది ఇదే సమయంలో మంచి ధరలు లభించగా, ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెట్టుబడి పెట్టిన ఖర్చులు కూడా చేతికి అందకపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.

Read also: Mahabubnagar news: లొకేషన్ ట్రేస్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు

 Drop in tomato prices

ధరల పతనం వెనుక కారణాలు

గత ఏడాది కిలో టమాట ధర ముప్పై నుంచి నలభై రూపాయల వరకు పలికింది. కానీ ప్రస్తుతం మాత్రం ధర పది నుంచి పన్నెండు రూపాయలకు మాత్రమే పరిమితమైంది. మార్కెట్లో పంట దిగుబడి భారీగా పెరిగినప్పటికీ, ఇతర ప్రాంతాలకు ఎగుమతులు మందగించడమే ఈ ధరల పతనానికి ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి. పురుగు మందులు, ఎరువులు మరియు కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిన తరుణంలో, మార్కెట్లో లభిస్తున్న ధరలు పెట్టుబడికి కూడా సరిపోవడం లేదు.

Tomato prices drop:పంటను వదిలేస్తున్న రైతులు

మార్కెట్కు తరలించే కొద్దీ రవాణా ఛార్జీలు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో కొందరు రైతులు తమ పంటను తోటల్లోనే వదిలేస్తున్నారు. మరికొందరు తమ నిరసనను తెలుపుతూ రోడ్లపై టమాటాలను పారబోస్తున్నారు. పెరిగిన సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం ఆదుకుంటేనే భవిష్యత్తులో సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తారు.

Epaper: epaper.vaartha.com

మందుబాబులకు షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha