Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.20 నీళ్ల బాటిల్ కోసం నిండు ప్రాణం బలి: విజయవాడలో అమానవీయ ఘటన

రూ.20 నీళ్ల బాటిల్ కోసం నిండు ప్రాణం బలి: విజయవాడలో అమానవీయ ఘటన

వార్త 2 days ago

A Man Killed For Water Bottle : ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దాహంతో ఉన్నవారికి నీళ్లు ఇవ్వడం మన సంస్కృతి. కానీ, నేడు సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది.

కేవలం 20 రూపాయల విలువైన నీళ్ల బాటిల్ కోసం ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన అమానవీయ ఘటన విజయవాడలో తీవ్ర కలకలం రేపింది. “నాకు భార్యాపిల్లలు ఉన్నారు, వదిలేయండి” అని ఆ యువకుడు వేడుకున్నా కనికరం చూపకుండా నలుగురు వ్యక్తులు ప్రాణం తీశారు. పోలీసుల కథనం ప్రకారం, తెలంగాణలోని నల్గొండ పట్టణానికి చెందిన 33 ఏళ్ల మాస సాయికుమార్ గత ఆరేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తున్న సాయికుమార్, విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. మూడు రోజుల తర్వాత తాను విజయవాడలో ఉన్నానని భార్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.

Srikakulam District Tragady : సముద్రతీరంలో విషాదం.. నలుగురు యువతీ యువకులు మృతి

 A Man Killed For Water Bottle

A Man Killed For Water Bottle : నీళ్ల బాటిల్ వివాదం – విద్యుత్ స్తంభానికి కట్టి దాడి

ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున పటమట డొంక రోడ్డులోని మద్యం దుకాణం సమీపంలో ఉన్న పాన్ షాపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సాయికుమార్ పాన్ షాపు ఫ్రిజ్‌లోంచి నీళ్ల బాటిల్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అటుగా పాలు సరఫరా చేసే వాహన డ్రైవర్ దీన్ని గమనించి, పాన్ షాపులో పనిచేసే రవిశంకర్‌కు సమాచారం ఇచ్చి సాయికుమార్‌ను అప్పగించాడు. రవిశంకర్ సాయికుమార్‌పై తీవ్ర దాడికి పాల్పడ్డాడు. సమీపంలోని బార్‌లో పనిచేసే అయ్యప్ప శంకర్ కూడా వీరితో కలిశాడు. సాయికుమార్ చేతులను వెనక్కి విరిచి విద్యుత్ స్తంభానికి కట్టేసి, కర్రలతో, పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాదాపు రెండు గంటల పాటు కొట్టారు. తనపై దాడి చేస్తున్న సమయంలో సాయికుమార్ తీవ్ర వేదనతో విలవిలలాడిపోయాడు. “నాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.. దయచేసి నన్ను కొట్టకండి, వదిలేయండి” అని ఎంతగానో వేడుకున్నాడు. అయినప్పటికీ దాడి చేసిన వారు ఏమాత్రం కనికరం చూపలేదు. సోమవారం తెల్లవారుజామున సాయికుమార్ స్పృహ కోల్పోయి పడిపోవడంతో, నిందితులు నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. పటమట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పవన్ కిషోర్ మాట్లాడుతూ, ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

రూ. 60 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం.. 7 మంది అరెస్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha