Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.300 దాటిన చికెన్ ధరలు!

రూ.300 దాటిన చికెన్ ధరలు!

వార్త 2 weeks ago

Chicken price today:తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ప్రస్తుతం సామాన్యులకు భారంలా మారాయి. డిమాండ్ పెరగడం ఇతర కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కిలో 300 రూపాయల స్థాయికి చేరుకున్నాయి.

ప్రస్తుతం మాంసం మార్కెట్‌లో చికెన్ కోసం వినియోగదారులు అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజలు చికెన్ కొనాలంటేనే ఆలోచిస్తున్నారు. ఈ ధరలు వచ్చే కొద్ది రోజులు ఇలాగే ఉండే అవకాశం కనిపిస్తోంది.

Read also: RTC Electric Bus Fire:కరీంనగర్ టూ హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సులో ఘోర అగ్నిప్రమాదం

 Chicken prices in the Telugu states

ప్రధాన నగరాల్లో చికెన్ రేట్లు

హైదరాబాద్ సహా ప్రధాన జిల్లాల్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఖమ్మం వంటి నగరాల్లో స్కిన్‌లెస్ చికెన్ కిలో 280 నుండి 300 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, అమలాపురం, భీమవరం వంటి ప్రాంతాల్లో కూడా 280 రూపాయల వరకు ధర నమోదైంది. కామారెడ్డిలో 280, వరంగల్‌లో 270, గుంటూరులో 250 నుండి 270 రూపాయల మధ్య చికెన్ అందుబాటులో ఉంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో చిన్నపాటి మార్పులు ఉంటున్నాయి.

Chicken price today:ఎందుకు పెరుగుతున్నాయి ధరలు

చికెన్ ధరలు పెరగడానికి ప్రధానంగా ఎండల ప్రభావం, ఫారమ్‌లలో ఉత్పత్తి తగ్గడం కారణం అవుతున్నాయి. కోళ్ల పెంపకంలో నిర్వహణ ఖర్చులు పెరగడం, దాణా ధరల ప్రభావం కూడా నేరుగా మార్కెట్‌పై కనిపిస్తోంది. పండుగలు, శుభకార్యాలు లేదా వారాంతాల్లో చికెన్ వినియోగం ఎక్కువగా ఉండటంతో ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. వ్యాపారులు తమకు వచ్చే కొనుగోలు ధరలను బట్టి రేట్లను నిర్ణయిస్తున్నారు. ధరల స్థిరీకరణ కోసం పౌల్ట్రీ రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

యోగా భారత్ ప్రపంచానికి ఇచ్చిన వరం.. ఇందిరా పార్క్ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha