Madhya Pradesh Politics: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీనా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యే నిర్మలా సప్రే, ఇప్పుడు తన సొంత పార్టీ ముందే ఊహించని డిమాండ్లు ఉంచారు.
తాను పార్టీలో కొనసాగాలంటే కొన్ని కండిషన్లు నెరవేర్చాలని ఆమె స్పష్టం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఫిరాయింపుల చట్టం సెగ తగులుతున్నా ఆమె వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.
తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన నిర్మలా సప్రే, ప్రతిపక్ష నాయకుడు ఉమాంగ్ సింఘర్‌కు బహిరంగంగా సవాల్ విసిరారు. తన నియోజకవర్గమైన బీనాను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని, అలాగే అభివృద్ధి పనుల కోసం రూ.300 కోట్లు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ రెండు కోరికలు నెరవేరిస్తేనే తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని, లేదంటే తన దారి తాను చూసుకుంటానని తేల్చి చెప్పారు. ఒక ఎమ్మెల్యే ఇలా బహిరంగంగా బేరసారాలకు దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Read Also : TVK : టీవీకేకి VCK మద్దతు?
Nirmala Sapre’s view towards BJP?
Madhya Pradesh Politics: బీజేపీ వైపు మొగ్గు.. కాంగ్రెస్ ఆగ్రహం
ఎన్నికల ఫలితాల తర్వాత నిర్మలా సప్రే తీరు కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటం లేదు. ఆమె తరచూ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో వేదికలు పంచుకోవడం, బీజేపీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి ఆమె పార్టీ మారతారనే ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నిర్మలా సప్రే రాజకీయ బేరసారాలకు తెరలేపారని మాజీ మంత్రి పీసీ శర్మ విమర్శించారు. బీజేపీ ఒత్తిడి వల్లే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
కోర్టు మెట్లెక్కిన వివాదం
నిర్మలా సప్రే వ్యవహారశైలిపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జబల్‌పూర్ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆమెపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేసింది. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఒకవైపు జిల్లా ఏర్పాటు డిమాండ్ ప్రజల సెంటిమెంట్ అని నిర్మల అంటుంటే, మరోవైపు ఇది కేవలం బీజేపీలోకి వెళ్లేందుకు ఆమె సాకుగా వాడుకుంటున్నారని భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

