Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.350కే నెలవారీ టోల్ పాస్ : స్థానిక వాహనదారులకు NHAI ఊరట

రూ.350కే నెలవారీ టోల్ పాస్ : స్థానిక వాహనదారులకు NHAI ఊరట

వార్త 1 month ago

NHAI : జాతీయ రహదారులపై నిత్యం ప్రయాణించే స్థానిక వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక గొప్ప శుభవార్త అందించింది. టోల్ గేట్లకు సమీపంలో నివసించే ప్రజల దీర్ఘకాలిక సమస్యకు చెక్ పెడుతూ, కేవలం రూ.

350లకే నెలవారీ టోల్ పాస్ (Local Pass) పొందే సదుపాయాన్ని మరింత సులభతరం చేసింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పలు టోల్‌ప్లాజాల వద్ద ఈ డిజిటల్ లోకల్ పాస్ విధానాన్ని అమలు చేస్తున్నారు.

20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానిక ప్రజలు :

ఈ వెసులుబాటు ప్రకారం, నిర్దిష్ట టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానిక ప్రజలు ఈ నెలవారీ పాస్‌ను పొందడానికి అర్హులు. ప్రైవేటు లేదా నాన్-కమర్షియల్ వాహనాలు కలిగిన వారు ఈ పాస్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ పాస్ ద్వారా సంబంధిత టోల్ గేట్ వద్ద నెల రోజుల పాటు ఎన్నిసార్లైనా అదనపు రుసుము చెల్లించకుండా ప్రయాణించే అవకాశం లభిస్తుంది.

గతంలో ఈ పాస్ పొందాలంటే టోల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేశారు. అర్హులైన వాహనదారులు ‘రాజమార్గయాత్ర’ (Rajmargyatra) మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. డిజిలాకర్ (DigiLocker), వాహన్ (VAHAN) పోర్టల్స్ ద్వారా దరఖాస్తుదారుల అడ్రస్, వాహన వివరాలను ఆటోమేటిక్‌గా వెరిఫై చేస్తారు. వివరాలు సరిపోలిన వెంటనే ఈ పాస్ నేరుగా వాహన ఫాస్టాగ్‌కు (FASTag) అనుసంధానమవుతుంది.

ఈ డిజిటల్ విధానం వల్ల స్థానికులకు టోల్ క్యూలలో సమయం వృథా కాకుండా ఉండటమే కాకుండా, పత్రాల సమర్పణ భారం కూడా పూర్తిగా తొలగిపోతుంది. టోల్ ప్లాజాల పరిధిలో నివసించే ప్రతినిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, స్థానికులకు ఇది ఆర్థికంగా ఎంతో ఊరటనిచ్చే నిర్ణయంగా చెప్పవచ్చు.

యువతను విస్మరిస్తే పతనం తప్పదు : కూనంనేని సాంబశివరావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha