Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఋషికొండ బీచ్‌లో విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన ముగ్గురు బాలురు

ఋషికొండ బీచ్‌లో విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన ముగ్గురు బాలురు

వార్త 3 weeks ago

Rishikonda beach incident: విశాఖపట్నం ఋషికొండ ఐటీ హిల్స్ బీచ్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సెలవు రోజు కావడంతో వెంకటేశ్వర, సృజన పాఠశాలలకు చెందిన ఐదుగురు విద్యార్థులు విహారం కోసం బీచ్‌కు వచ్చారు.

వీరిలో నితీష్ (15), సూర్య ప్రకాష్ (14), ప్రశాంత్ (13) అనే ముగ్గురు బాలురు సముద్ర కెరటాల్లో గల్లంతయ్యారు. మెరైన్ పోలీసులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించినప్పటికీ, కాళ్లు కడుక్కొని వస్తామని చెప్పి సముద్రంలోకి దిగిన సమయంలో ఒక్కసారిగా వచ్చిన బలమైన కెరటానికి ముగ్గురు కొట్టుకుపోయినట్లు ఏసీపీ అప్పలరాజు తెలిపారు.

Read Also : CJP protest: CJP నిరసనలో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి

 Tragedy at Rushikonda Beach: Three boys swept away by the sea.

Rishikonda beach incident: ఒకరి మృతదేహం లభ్యం.. తీవ్రంగా గాలింపు చర్యలు

సమాచారం అందుకున్న వెంటనే మెరైన్ పోలీసులు, స్థానిక గజ ఈతగాళ్లు సహాయక చర్యలు చేపట్టారు. సీపీ బాగ్చి ఘటనాస్థలికి చేరుకుని స్కూబా డైవర్లు, నేవీ హెలికాప్టర్ సహాయంతో చేపడుతున్న ‘సెర్చ్ అండ్ రెస్క్యూ’ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. గాలింపు సమయంలో ప్రశాంత్ మృతదేహం లభ్యం కాగా, గల్లంతైన నితీష్, సూర్య ప్రకాష్ ల కోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాదంతో బాలుర కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

తిరుపతిలో ఘోర ప్రమాదం.. టాబ్లెట్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఐదుగురు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha