Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రుతురాజ్ సంచలనం.. ఏడో స్ధానంలో వచ్చి సూపర్ సెంచరీ

రుతురాజ్ సంచలనం.. ఏడో స్ధానంలో వచ్చి సూపర్ సెంచరీ

వార్త 4 days ago

Ranji Trophy: పూణే వేదికగా జార్ఖండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మహారాష్ట్ర స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకంతో మెరిసాడు. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గైక్వాడ్ నాటౌట్‌గా 101 పరుగులు (172 బంతుల్లో) చేసి మహారాష్ట్రను పటిష్ట స్థితికి చేర్చాడు.

2026 Asian Para Games : గోల్డ్ గెలిచిన తెలంగాణ యువతి

అంకిత్ బావ్నే (169 పరుగులు) తో కలిసి గైక్వాడ్ 6వ వికెట్‌కు 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడీ ధాటికి మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 150 ఓవర్లలో 527/5 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో మహారాష్ట్రకు 358 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

గైక్వాడ్ వీరోచిత సెంచరీ

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర ఒకదశలో 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో అంకిత్ బావ్నే మరియు దిగ్విజయ్ పాటిల్ ఇన్నింగ్స్‌ను నిలబెడుతూ 4వ వికెట్‌కు 230 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అయితే, స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడటంతో మహారాష్ట్ర 345/5 స్కోరు వద్ద మళ్లీ ఒత్తిడిలో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్, బావ్నేతో కలిసి బాధ్యతాయుతంగా ఆడాడు. 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో ఎంతో ఓపికగా 101 పరుగులు చేసి మహారాష్ట్ర స్కోరును 520 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 10వ సెంచరీ

ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు ఇది 10వ సెంచరీ కావడం గమనార్హం. టీమిండియా తరఫున ఇప్పటివరకు 12 వన్డేలు, 23 టీ20లు ఆడిన గైక్వాడ్.. టెస్టుల్లో ఇంకా అరంగేట్రం చేయలేదు.త్వరలో జరగబోయే న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత వన్డే జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. ఈ పర్యటనలో ‘ఇండియా-ఎ’ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించనున్నాడు.

రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్-క్లాస్ గణాంకాలు

మొత్తం మ్యాచ్‌లు: 49

మొత్తం పరుగులు: 3,466

సగటు: 44కి పైగా

సెంచరీలు / హాఫ్ సెంచరీలు: 10 సెంచరీలు, 18 అర్ధశతకాలు

కివీస్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా.. సిరీస్‌ గెలుపే లక్ష్యంగా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha