Nukaraju family commits suicide : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పిఠాపురం పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు షేక్ సాదిక్ ఖాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కి పంపినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు.
ఆగస్ట్ 24న సోమవారం కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ… ఏఈ నూకరాజు రాసిన మరణవాంగ్మూలంతో పాటు ఆయన కుమార్తె సౌజన్య రాసిన లేఖ, సౌజన్య మామ భాస్కర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సాదిక్‌ను అరెస్ట్ చేశామని ఎస్పీ వివరించారు. సౌజన్య భర్త జగదీష్ రెడ్డి మృతికి కారణాలు, మతం మారాలనే ఒత్తిడి, బ్లాక్ మెయిలింగ్, మృతులపై నిందితుడు పాల్పడిన బెదిరింపులు తదితర అంశాలపై ఇంకా సమగ్ర దర్యాప్తు కొనసాగించాల్సి ఉందని ఎస్పీ వివరించారు.
Nukaraju family commits suicide
Nukaraju family commits suicide : బయటపడిన సౌజన్య రాసిన లేఖ
16వ తేదీన నూకరాజు రాసిన లేఖ బయటపడగా, ఆ తర్వాత 17వ తేదీన నూకరాజు కుమార్తె రాసిన లేఖ ఆమె టూవీలర్‌లో దొరికిందని, అందులో తమ పరిస్థితికి కారణం సాదిక్ ఖాన్ అంటూ స్పష్టంగా రాసి ఉందని సౌజన్య మామ భాస్కర్‌రెడ్డి కాకినాడ సమీపంలోని సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సౌజన్య భర్త జగదీశ్వర్‌రెడ్డి ఈ ఏడాది జూలై 2వ తేదీన మరణించారని, ఆయన కూడా సాదిక్ వేధింపులతోనే చనిపోయారంటూ తాజాగా సౌజన్య రాసిన లేఖ దొరికిందని భాస్కర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మాట్లాడిన భాస్కర్‌రెడ్డి .. తన కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి మరణంలోనూ సాదిక్ ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
‘ఈ ఏడాది జూలై రెండవ తేదీన నా కొడుకు చనిపోయాడు.. అప్పుడు అది సహజ మరణమే అనుకున్నాం కానీ. నా కోడలు, మనవడు, వియ్యంకుడు భార్యతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించగా మనవడు కార్తీక్ రెడ్డి మాత్రమే ప్రాణాలతో మిగిలాడు. మనవడు చెప్పిన వివరాల ప్రకారం కోడలు సౌజన్య బండిలో మూడు కవర్లు ఉన్నాయి. వాటిని పోలీసుల సమక్షంలోనే తీసి చూడగా తన కుమారుడు అయిన జగదీశ్వర్ రెడ్డికి ఏదో మందులు ఇచ్చి సాదిక్ చంపినట్లు సౌజన్య రాసిన లెటర్లో ఉంది’ అని భాస్కర్‌రెడ్డి తెలిపారు. అలాగే తన కోడలు సౌజన్య ప్రైవేట్ విషయాలను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసినట్లు, అతనికి సహకరించకపోతే నూకరాజు కుటుంబాన్ని మొత్తం చంపుతానని బెదిరించినట్లు ఆ లేఖలో రాసి ఉందని ఆయన చెప్పారు.
Read Also hindi news: hindi.vaartha.com
శ్రీశైలంలో తీవ్ర విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య!

