Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సామాజిక భద్రతకు స్వర్ణ యుగమా?

సామాజిక భద్రతకు స్వర్ణ యుగమా?

వార్త 1 week ago

Pension scheme : దేశ ఆర్థికాభివృద్ధికి అసలైన చోదకశక్తి ఎవరు అంటే, సందేహం లేకుండా వేతన జీవులు, కార్మికులే అని చెప్పాలి. పరిశ్రమలు, సేవారంగం, నిర్మాణ రంగం, సమా చార సాంకేతిక రంగం ఏ రంగాన్ని చూసినా వారి కృషే దేశ ప్రగతికి వునాది.

అయితే, వారి శ్రమకు తగిన సామా జిక భద్రత కల్పించడంలో చాలాకాలంగా కొన్ని లోపాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పించే ఉద్యోగుల భవిష్య నిధి, ఉద్యోగుల పెన్షన్ పథకంలకు సంబంధించిన వేతన పరిమితి, కనీస పింఛన్ అంశాలు ఎన్నో సంవత్సరాలుగా చర్చనీయాంశాలుగా మారాయి. ఇలాంటి నేపథ్యంలో ఉద్యో గుల గరిష్ట వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలం గా స్పందించినట్లు వెలువడుతున్న సమాచారం లక్షలాది ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం నెలకు రూ.1,000గా ఉన్న కనీస పెన్షన్ను రూ.7,500కు పెంచే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తున్నట్లు వస్తున్న సంకేతాలు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఈరెండు నిర్ణయాలు అమలులోకి వస్తే ప్రైవేట్ రంగ ఉద్యోగుల సామాజిక భద్రతలో ఒక కీలక మలుపు తిరిగినట్లే అవు తుంది.

 Pension scheme

Pension scheme : ఉద్యోగుల భవిష్య నిధి

ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.15 వేల వేతన పరిమితి దాదాపు దశాబ్దం కిందటి పరిస్థితులకు అనుగు ణంగా నిర్ణయించబడింది. కానీ ఈ కాలంలో ద్రవ్యోల్బణం పెరిగింది. జీవన వ్యయం గణనీయంగా అధికమైంది. ఉద్యోగుల వేతనాల్లో కూడా మార్పులు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో పాత పరిమితిని కొనసాగించడం వాస్తవ పరి స్థితులకు అనుగుణంగా లేదనే అభిప్రాయం చాలా కాలంగా వ్యక్తమవుతోంది. అందుకే వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచడం కాలానుగుణమైన సంస్కరణగా పరిగణించవచ్చు. ఈ మార్చు అమలైతే కొత్తగా మరింత మంది ఉద్యోగులు ఉద్యోగుల భవిష్య నిధి, ఉద్యోగుల పెన్షన్ పథకాల పరిధి లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగుల పొదుపు పెరగ డమే కాకుండా, భవిష్యత్తులో వారికి లభించే పెన్షన్ కూడా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ భద్రతతో పాటు ఆర్థిక భరోసాకూడా బలపడుతుంది. దీర్ఘకాలిక ఆర్ధిక ప్రణా ళికలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్క కనీస పెన్షన్ పెంపు అంశం మరింత కీలకమైనది. ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.1,000 నెలవారీ పెన్షన్ నేటి ధరల పరిస్థితుల్లో సరిపోదన్న అభిప్రాయం చాలా కాలంగా వినిపిస్తోంది. మందులు, వైద్య ఖర్చులు, అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన ఈ రోజుల్లో వెయ్యి రూపాయలతో గౌరవ ప్రదమైన జీవితం గడపడం అసాధ్యమే. అందుకే కనీస పెన్షన్ను రూ.7,500కు పెంచాలని పెన్షనర్ల సంఘాలు ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాయి.

ప్రకటనలతో సరిపోదు

ఒకవేళ ఈ ప్రతిపాదన అమలైతే కోట్లాది పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అది ఆర్థికంగా మాత్రమే కాకుండా మానసికం గా కూడా గొప్ప ఊరటనిస్తుంది. ఉద్యోగ జీవితమంతా కష్టపడి దేశ ఆర్ధిక వ్యవస్థకు సేవలందించిన వారికి వృద్ధా ప్యంలో కనీస జీవన భద్రత కల్పించడం సంక్షేమ రాజ్య బాధ్యతగా భావించాలి. పెన్షన్ అనేది దానం కాదు, అది ఉద్యోగి తన సేవా కాలంలో సంపాదించుకున్న హక్కు అనే భావనకు మరింత బలం చేకూరుతుంది. అయితే ఈ సంస్కరణలు అమలవ్వాలంటే కేవలం ప్రకటనలతో సరి పోదు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, యజమానులు, కార్మిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి సమగ్ర కార్యా చరణను రూ పొందించాలి. యజమానులపై అదనపు భారం పడకుండా, అదే సమయంలో ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతినకుండా సమతుల్య విధానం అవసరం. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఆర్ధిక సామర్థ్యాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం అసంఘటిత రంగ కార్మికులది. దేశంలోని భారీ సంఖ్యలో కార్మికులు ఇప్పటికి సామాజిక భద్రత పరిధిలోకి పూర్తిగా రాలేదు. కాబట్టి వేతన పరిమితి పెంపు, కనీస పెన్షన్ పెంపుతో పాటు అసంఘటిత రంగ కార్మికులను కూడా సామాజిక భద్రతా వ్యవస్థలోకి తీసుకురావడానికి మరింత సమర్థమైన విధానాలు రూపొందించాల్సిన అవ సరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ సంస్కరణల అసలైన లక్ష్యం నెరవేరుతుంది.

 Pension scheme

దేశ ఆర్థికవ్యవస్థకు బలమైన పెట్టుబడి

దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఉద్యోగుల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడాలి. స్థూల దేశీయోత్పత్తి పెరగడం మాత్రమే అభివృద్ధి కాదు, ఆ అభి వృద్ధి ఫలాలు ఉద్యోగులకు, పెన్షనర్లకు చేరినప్పుడే అదినమ గ్రాభివృద్ధిగా నిలుస్తుంది. ఉ ద్యోగ భద్రత, వృద్ధాప్యభరోసా, సామాజిక రక్షణ ఈ మూడు అంశాలు బలపడితేనే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా ఉంటుంది. వేతన పరిమితి పెంపు, కనీస పెన్షర్ పెంపుపై కేంద్రం తీసుకోబోయే నిర్ణ యాలు కోట్లాది కుటుంబాల జీవితాలను ప్రభావితం చేయ గలవు, అందుకే ఈ అంశాన్ని కేవలం పరిపాలనా నిర్ణయంగా కాకుండా సామాజిక న్యాయానికి సంబంధించిన కీలకసంస్క రణగా చూడాలి. ఉద్యోగుల ఆశలు నిజమయ్యేలా త్వరిత గతిన తుదినిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే, అది కేవలం వేతనజీవులకు మాత్రమే కాదు, దేశ ఆర్థికవ్యవస్థకు కూడా ఒక బలమైన పెట్టుబడిగా నిలుస్తుంది. ఉద్యోగుల శ్రమకు గౌరవం ఇవ్వాలంటేవారి భవిష్యత్తుకు భరోసాకల్పిం చడమే ఉత్తమ మార్గమని ప్రభుత్వంగుర్తిస్తే, ఈ నిర్ణయాలు భారత కార్మికచరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి.

-తిప్పర్తి శ్రీనివాస్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

రేషన్ కార్డు ఈ-కేవైసీ మొబైల్ ప్రాసెస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha