Vaibhav Suryavanshi RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026) సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ (RR) యువ సంచలనం, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఆటతీరుతోనే కాకుండా, తన పరిణతితోనూ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు.
ఈ సీజన్‌ను ఎంతో దూకుడుగా ఆరంభించిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత వరుస ఓటములతో గాడి తప్పింది. ఒక దశలో హ్యాట్రిక్ పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు కూడా కష్టమే అనుకున్న తరుణంలో, లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై గెలిచి మళ్లీ నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను వైభవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
Read Also :SRH vs RCB Today Match :టాప్-2 కోసం హైదరాబాద్‌కు హోరాహోరీ పోరు!
“సంగక్కర ముఖంలో టెన్షన్ చూశా.. నేనే భరోసా ఇచ్చా!”
లక్నోతో జరిగిన కీలక మ్యాచ్‌కు ముందు హెడ్ కోచ్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. “లక్నో మ్యాచ్‌కు ముందు వరుస ఓటములతో మాపై విపరీతమైన ప్రెజర్ ఉంది. ఆ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి జట్టు మా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నేను బ్యాటింగ్‌కు వెళ్లేందుకు ప్యాడ్లు కట్టుకుని సిద్ధమవుతున్న సమయంలో మా ప్రధాన కోచ్ కుమార్ సంగక్కరను చూశాను. ఆయన ముఖంలో తీవ్రమైన టెన్షన్, ఒత్తిడి స్పష్టంగా కనిపించాయి. కానీ, నాలో మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. నేను బాగా ఆడి జట్టును గెలిపించగలనని నమ్మాను. వెంటనే కోచ్ దగ్గరకు వెళ్లి.. ‘సార్, మీరేం టెన్షన్ పడకండి, నేను జట్టును గెలిపిస్తాను. ఈ పిచ్‌పై ఇదేమీ అంత భారీ స్కోర్ కాదు’ అని భరోసా ఇచ్చాను” అని వైభవ్ పేర్కొన్నాడు. 15 ఏళ్ల చిన్న వయసులోనే అంతటి లీజెండరీ కోచ్‌కు ధైర్యం చెప్పే స్థాయి గుండె నిబ్బరాన్ని ప్రదర్శించడం పట్ల క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Vaibhav is excelling in IPL 2026 with 579 runs.
ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్-3.. సచిన్‌తో పోలిక!
గత సీజన్‌లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. ఈ సీజన్‌లో ఏకంగా సీనియర్ ప్లేయర్లకు సవాల్ విసురుతూ ఆరెంజ్ క్యాప్ (Orange Cap) రేసులో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 579 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. వైభవ్ అసాధారణ బ్యాటింగ్ శైలిని చూసి భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె ఆకాశానికెత్తారు. “సచిన్ టెండూల్కర్ తన కెరీర్ ఆరంభంలో భారత జట్టులోకి వచ్చినప్పుడు ప్రపంచ స్థాయి హేమాహేమీ బౌలర్లను ఎలా ఎదుర్కొన్నాడో.. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే నాకు ఆనాటి యువ సచిన్ గుర్తుకొస్తున్నాడు. దేవుడే క్రికెట్ కోసమే ఈ అబ్బాయిని తయారుచేసినట్లుగా అనిపిస్తోంది. ఖచ్చితంగా ఇతను దేశానికి మంచి పేరు తీసుకువస్తాడు” అని కిరణ్ మోరె కొనియాడారు.
Vaibhav Suryavanshi RR: మే 24న ముంబైతో చావోరేవో పోరు
రాజస్థాన్ రాయల్స్ జట్టు మే 24న ముంబై ఇండియన్స్‌తో (MI vs RR) తన చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్ (నాకౌట్) బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకోవాలంటే ఆర్ఆర్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. లీగ్ దశలో చివరిదైన ఈ కీలక పోరులో కూడా వైభవ్ ఇదే విధమైన దూకుడు చూపిస్తే రాజస్థాన్ రాయల్స్ నాకౌట్ ప్రయాణం మరింత సులువు అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

