Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. మరో ముగ్గురిపై సిట్ దృష్టి

సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. మరో ముగ్గురిపై సిట్ దృష్టి

వార్త 1 week ago

Sai Krishna Custodial Death: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన గెడ్డం సాయికృష్ణ (25) కస్టడీ మరణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను మరింత వేగవంతం చేసింది.

ఈ కేసులో కీలక నిందితుడిగా ఉండి ఇప్పటికే అరెస్టయిన మాజీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) నాగార్జునకు.. మరో ముగ్గురు వ్యక్తులు సహకరించినట్లు సిట్ అధికారులు తాజాగా గుర్తించారు. పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నానిలతో పాటు సిఐ స్నేహితుడు సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలను తీవ్రం చేశారు. నిందితుల కాల్ డేటా రికార్డులు (CDR), పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వీరి పాత్రపై బలమైన ఆధారాలు సేకరించినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది.

లాకప్‌లోనే చిత్రహింసలు.. మాయమైన మృతదేహం

రిమాండ్ నివేదికలో సిట్ పేర్కొన్న వివరాల ప్రకారం.. రౌడీ షీటర్‌గా ఉన్న సాయికృష్ణను మే 6వ తేదీన మార్కాపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించి చట్టవిరుద్ధంగా బంధించారు. మే 6 నుంచి 8వ తేదీల మధ్య కాలంలో పోలీసులు సాయికృష్ణను తీవ్రంగా హింసించడంతో అతడు కస్టడీలోనే ప్రాణాలు విడిచాడు. ఈ క్రూరమైన ఘటన అనంతరం సాక్ష్యాధారాలను తుడిచేసేందుకు నిందితులు మృతదేహాన్ని రహస్యంగా మాయం చేశారు. ఆ శవం ఇప్పటివరకు లభ్యం కాలేదు. పైగా, ఆ సమయంలో పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సీసీటీవీ డీవీఆర్ (DVR) డేటాను కూడా కావాలనే తొలగించారని ఫోరెన్సిక్ విశ్లేషణలో తేలింది.

Sai Krishna Custodial Death: పరారీలో నిందితులు.. పోలీసుల నిఘా

మాజీ సిఐ నాగార్జున అరెస్ట్ కాగానే, ఈ నేరంలో భాగస్వాములైన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని, ప్రైవేట్ వ్యక్తి సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే, నిందితులు మే 29వ తేదీన వడ్డేశ్వరం ప్రాంతంలో సాయికృష్ణ బంధువులను కలిసినట్లు కాల్ డేటా, సీసీటీవీ ఆధారాల ద్వారా సిట్ ధ్రువీకరించింది. ఈ ఘోరంలో కేవలం వీరిద్దరే కాకుండా, స్టేషన్‌కు చెందిన మరికొందరు పోలీసు సిబ్బంది హస్తం కూడా ఉందా అనే కోణంలో అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.

రంగంలోకి సిట్.. హైకోర్టులో జులై 6న విచారణ

బాధిత కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి న్యాయం చేయాలని వేడుకోవడంతో, ప్రభుత్వం ఈ కేసు విచారణ బాధ్యతలను ఐజీపీ రవిప్రకాశ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (SIT) అప్పగించింది. మరోవైపు, ఈ లాకప్ డెత్ కేసుపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. తదుపరి విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసింది. సిట్ సమర్పించే తుది నివేదికను పరిశీలించిన తర్వాతే సీబీఐ దర్యాప్తుపై నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఆర్టీజీఎస్ సేవలపై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha