Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సిట్ అదుపులోకి ఆర్ఎంపీ డాక్టర్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సిట్ అదుపులోకి ఆర్ఎంపీ డాక్టర్

వార్త 4 days ago

Saikrishna lockup death case:సాయికృష్ణ లాకప్ డెత్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు కీలక అడుగు వేశారు.

అమెరికా నుండి తిరిగి వచ్చిన ఆర్ఎంపి డాక్టరును పిలిపించి విచారించారు. సాయికృష్ణకు చికిత్స అందించిన సమయం, పరిస్థితులపై డాక్టరును పలు ప్రశ్నలు అడిగారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు కీలక విషయాలను సేకరిస్తున్నారు.

Read also: Hyderabad Highway Accident: విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం..10 మందికి గాయాలు!

 saikrishna lockup death case

కృష్ణలంక స్టేషన్లో చికిత్స వెనుక మిస్టరీ

సిట్ విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణకు కృష్ణలంక స్టేషన్లో ఉన్నప్పుడు ఆర్ఎంపి డాక్టర్ వైద్యం చేసినట్టు గుర్తించారు. అసలు ఎవరు పిలిస్తే సాయికృష్ణకు వైద్యం చేశారు, అప్పుడు ఏ గాయాలు ఉన్నాయనే దానిపై డాక్టర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ స్టేట్మెంట్ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం కానుంది. నిందితుల పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Saikrishna lockup death case:సిట్ ఎదుట బయటపడిన అశోక్, నాని పాత్ర

ఆర్ఎంపి డాక్టర్ చెప్పిన వివరాలు విచారణను మలుపు తిప్పాయి. అశోక్, నాని ఫోన్ చేసి పిలవడంతోనే స్టేషన్కు వెళ్లినట్టు డాక్టర్ సిట్ అధికారులకు వివరించినట్టు సమాచారం. సాయికృష్ణ పరిస్థితి గురించి నిందితులు ఏం చెప్పారో కూడా డాక్టర్ వెల్లడించారు. ఈ ఆధారాలతో సిట్ అధికారులు తదుపరి చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Epaper: epaper.vaartha.com

వెనిజులాలో వందకు పైగా గల్లంతు.. అమెరికా బహిష్కరణ జరిగిన కొన్ని గంటల్లోనే తీవ్ర విషాదం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha