Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై అంబటి సంచలన వ్యాఖ్యలు

సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై అంబటి సంచలన వ్యాఖ్యలు

వార్త 2 weeks ago

Sai Krishna Missing Case: ఆంధ్రప్రదేశ్‌లో రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఇప్పటికే ఈ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసి, విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ ఉదంతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వంపై, పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read also: Konaseema crime: దారుణం.. నమ్మిన కూలీలే రైతును పొట్టనబెట్టుకున్నారు!

 Ambati makes sensational comments on the Saikrishna missing case.

Sai Krishna Missing Case: ఇది మిస్సింగ్ కాదు.. లాకప్ డెత్: అంబటి రాంబాబు

మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక వ్యక్తి అదృశ్యమైన కేసు కాదని, పోలీసులే అతడిని లాకప్ డెత్ చేసి శవాన్ని మాయం చేశారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సాయికృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నామని చెబుతున్న మాటల్లో ఎలాంటి వాస్తవం లేదని, అతడు ప్రస్తుతం బతికి లేడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఈ విషయంలో ఎలాంటి రాజకీయం చేయడం లేదని, కొడుకు కోసం తల్లడిల్లుతున్న ఒక పేద తల్లి ఆవేదనను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఐపీఎస్ విచారణపై నమ్మకం లేదు.. సీబీఐ విచారణ జరపాలి!

ప్రభుత్వం ఆదేశించిన సీనియర్ ఐపీఎస్ అధికారి విచారణపై అంబటి రాంబాబు తీవ్ర అపనమ్మకం వ్యక్తం చేశారు. “గ్యాంగ్ వార్‌లోనే సాయికృష్ణ ఏమైపోయాడో తెలియకుండా పోయాడు” అని పోలీసులు ముందే రాసుకున్న స్క్రిప్ట్‌ను, రిపోర్టును మాత్రమే ఈ విచారణలో కూడా బయటకు తెస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తిని హత్య చేయడం మొదటి నేరమైతే, ఆధారాలు దొరకకుండా డెడ్ బాడీని మాయం చేయడం అంతకంటే పెద్ద నేరమని దుయ్యబట్టారు. కృష్ణలంక పీఎస్ ఉదంతంపై పూర్తి నిజాలు నిగ్గు తేలాలంటే తక్షణమే సీబీఐ (CBI) విచారణ జరిపించాలని, అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్‌ను సస్పెండ్ చేసి, బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

పోలీసులపై కుటుంబ సభ్యుల తీవ్ర ఆరోపణలు

మరోవైపు, సాయికృష్ణ కుటుంబ సభ్యులు కూడా పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సీఐ నాగరాజు తన కుమారుడిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, చంపేస్తామంటూ ముందే బెదిరించారని సాయికృష్ణ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. సాయికృష్ణను పోలీసులు స్టేషన్‌లోనే కొట్టి చంపేశారని (లాకప్ డెత్), ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా లోపాయికారీగా అతడి శవాన్ని కూడా మాయం చేసేశారంటూ సాయికృష్ణ మేనమామ నేరుగా ఆరోపణలు చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

సాయికృష్ణ కేసుతో రాజకీయ కలకలం.. జూన్ 29న హైకోర్టు డెడ్‌లైన్‌పై ఉత్కంఠ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha