Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సభలో కంటతడి పెట్టిన మాజీ మంత్రి బొత్స

సభలో కంటతడి పెట్టిన మాజీ మంత్రి బొత్స

వార్త 3 weeks ago

Botsa Satyanarayana: విజయనగరం జిల్లా గరివిడిలోని వైకాపా కార్యాలయంలో గురువారం నిర్వహించిన పార్టీ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో తీవ్ర భావోద్వేగ వాతావరణం నెలకొంది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా కంటతడి పెట్టారు. పార్టీ అభివృద్ధికి, కార్యకర్తలతో కలసి నడిచిన రోజులను గుర్తు చేసుకుంటూ ఆయన ఆవేదనకు గురికావడంతో సభలో ఉన్న పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా కంటతడి పెట్టారు.

Read Also : CBN : చంద్రబాబు దంపతులకు వివాహ వార్షికోత్సవం విషెస్ చెబుతూ నిర్మాత బండ్ల గణేష్ ఎమోషనల్

 Former Minister Botsa gets emotional in the House.

Botsa Satyanarayana: మేనల్లుడు చిన్న శ్రీను తెదేపాలో చేరిక.. బొత్స ఆవేదన

జిల్లా పరిషత్ చైర్మన్, వైకాపా జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైకాపాను వీడి ఇటీవల తెదేపా (TDP) లో చేరిన విషయాన్ని నాయకులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. బొత్స మేనల్లుడైన చిన్న శ్రీనుతో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు. కొన్నాళ్లుగా బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీను మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని, పార్టీలో మేనల్లుడి ప్రాధాన్యం తగ్గించేలా ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలోనే చిన్న శ్రీను వైకాపాకు రాజీనామా చేసి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

స్థానిక ఎన్నికల వేళ వైకాపాకు భారీ నష్టం

ఉత్తరాంధ్రలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చిన్న శ్రీను పార్టీ మారడం వైకాపాకు కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా తనకంటూ సొంత క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్న చిన్న శ్రీను.. గత జడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా 34 మండలాలను కైవసం చేసుకోవడంలో, 400కు పైగా ఎంపీటీసీలు, 800కు పైగా పంచాయతీ సర్పంచి పదవులను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఆయన వెంటే తెదేపా వైపు మొగ్గుచూపితే జిల్లాలో వైకాపా తీవ్ర నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

విశాఖ నుంచి బ్యాంకాక్‌కు డైరెక్ట్ ఫ్లైట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha