Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సచిన్, కోహ్లీలను మించిపోతాడు.. వైభవ్ సూర్యవంశీపై డేల్ స్టెయిన్ ప్రశంసలు

సచిన్, కోహ్లీలను మించిపోతాడు.. వైభవ్ సూర్యవంశీపై డేల్ స్టెయిన్ ప్రశంసలు

వార్త 1 day ago

Dale Steyn: గత ఏడాది కాలంగా భారత క్రికెట్ ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక పేరు వైభవ్ సూర్యవంశీ. 15 ఏళ్ల ప్రాయంలోనే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ పూర్తిగా ఈ వండర్‌కిడ్ పేరుతోనే నడిచింది. టోర్నీలో ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 776 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న దశాబ్దాల కాలం నాటి రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. అతి పిన్న వయసులోనే భారత సీనియర్ జట్టుకు ఎంపికైన క్రీడాకారుడిగా వైభవ్ సరికొత్త రికార్డు లిఖించాడు.

Read also: FIFA World Cup 2026: వరల్డ్ కప్ మ్యాచ్ చూడాలని వచ్చి ప్రాణాలు విడిచిన వృద్ధుడు!

 Dale Steyn makes sensational comments on Vaibhav Suryavanshi!

Dale Steyn: వైభవ్ పెద్ద సూపర్ స్టార్ అవుతాడు!

వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన టాలెంట్‌పై ప్రస్తుతం అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలింగ్ లెజెండ్ డేల్ స్టెయిన్ ఈ క్రేజీ కుర్రాడి బ్యాటింగ్ ప్రతిభపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ భవిష్యత్తు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల కంటే వెయ్యి రెట్లు బ్రైట్‌గా ఉంటుందని ఆయన స్పష్టం చేశాడు. కెరీర్ ముగిసే సమయానికి సచిన్, విరాట్ ఇద్దరి లెగసీని కలిపినా.. వైభవ్ అంతకంటే పెద్ద సూపర్ స్టార్‌గా ఎదుగుతాడని 42 ఏళ్ల స్టెయిన్ అంచనా వేశాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న చాలా మంది సీనియర్ ఆటగాళ్ల కంటే ఈ 15 ఏళ్ల పిల్లోడే అత్యంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని కొనియాడాడు.

బీసీసీఐకి డేల్ స్టెయిన్ కీలక సూచన

వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంతటి గొప్ప స్థాయికి చేరాలంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక ముఖ్యమైన కండిషన్ పాటించాలని డేల్ స్టెయిన్ సూచించాడు. ఇంత చిన్న వయసులోనే విపరీతమైన క్రేజ్, బాధ్యత రావడం వల్ల అతడిని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలని చెప్పాడు. "వైభవ్ భారత క్రికెట్‌కు దొరికిన ఒక అమూల్యమైన నిధి. అంతా బాగానే ఉంది కానీ, ఈ వయసులో అతడిని సరిగ్గా చూసుకోకపోతే, కెరీర్ మధ్యలోనే దారి తప్పే ప్రమాదం కూడా ఉంది. గొప్ప బాధ్యతతోనే గొప్ప ప్రతిఫలం వస్తుంది. కాబట్టి టీమ్ మేనేజ్‌మెంట్ అతడిపై ఒత్తిడి పడకుండా చాలా జాగ్రత్తగా గైడ్ చేయాలి" అని స్టెయిన్ బీసీసీఐని హెచ్చరించాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha