Dailyhunt
సదాశివపేట ఎంపీడీవో కార్యాలయంలో అస్తవ్యస్త పాలన

సదాశివపేట ఎంపీడీవో కార్యాలయంలో అస్తవ్యస్త పాలన

వార్త 5 days ago

Sadashivpet: ప్రజాస్వామ్యంలో సమాచార వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న సదాశివపేట మండల అభివృద్ధి అధికారి… సమయపాలన పాటించని ఉన్నత స్థాయి అధికారులు..

ఉదయం 10 గంటల 40 నిమిషాలకు కూడా అటెండర్స్, మరియు సీనియర్ అసిస్టెంట్ కుర్చీ తప్ప అన్ని సీట్లు ఖాళీగానే… ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేస్తూ పాలనలోని మంచి చెడుల సమాచారాన్ని చేరవేసే పత్రికలకు సదాశివపేట మండల పరిషత్ కార్యాలయం తమ పాలన సమాచారం చాలా రోజులుగా తెలపడం లేదు.

Read Also: Electricity Artisans Termination: విద్యుత్ ఆర్టిజన్ల తొలగింపు!

 Sadashivpet: Chaotic governance in the Sadashivpet MPDO office

గ్రామ పాలనను అభివృద్ధిని పర్యవేక్షించే మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో గ్రామ పరిపాలన అభివృద్ధిపై తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి జరిగిన తీరు, పనులలో నాణ్యత- లోపాలను సమీక్షించినప్పుడు వాటి గురించి ప్రజలకు తెలియజేయడానికి వారధి లాగా ఉండే పత్రికలకు సమాచారం ఇవ్వకపోవడంలో అంతర్యం ఏమిటి అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలన ముగిసిన తర్వాత ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచులు పదవి చేపట్టి ఐదు నెలల కాలం గడుస్తున్నప్పటికీ, అభివృద్ధిపై అన్ని శాఖల అధికారులు సర్పంచులతో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం వివరాలను కూడా ఇంతవరకు పత్రికలకు సమాచారం ఇవ్వలేదు.

తరతరాల నుండి కూడా వార్తలను ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి చేరవేయడానికి లేఖలు ఉండేవి. కాలానుగుణంగా వస్తున్న మార్పులతో సమాచార వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చాయి. గతంలో రేడియోల ద్వారా దిన పత్రికల ద్వారా కొనసాగిన సమాచార వ్యవస్థ ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రజా పాలన ప్రగతి పాలన లోని ప్రగతిని కానీ లోటుపాట్లను కానీ అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించి ప్రజలకు చేరేవేసే పత్రికలకు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.

మండల అభివృద్ధి అధికారి పూర్తి పర్యవేక్షణలో జరిగే గ్రామాలలోని వివిధ ప్రగతి పథకాలలోని లోటుపాట్లను గుర్తించాల్సిన అధికారులు ఉపాధి హామీ పథకంలో కూలీలకు జరుగుతున్న ఇబ్బందులను పరిష్కరించడం లేదని పలువురు కూలీలు అంటున్నారు. నాయకులు అధికారులతో నిర్వహించే సర్వసభ్య సమావేశాలకు పత్రికల వారికి సమాచారం ఎందుకు ఇవ్వడంలేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులే సమయపాలన పాటించకపోతే సుపరిపాలన ఎలా అందిస్తారని పలువురు అంటున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఉస్మానియాలో వైద్య విదార్థి ఆత్మహత్య.. ఒత్తిడే కారణమా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha