Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సహారా ఎడారిలో తీవ్ర విషాదం ..నీళ్లు దొరక్క 49 మంది మృతి

సహారా ఎడారిలో తీవ్ర విషాదం ..నీళ్లు దొరక్క 49 మంది మృతి

వార్త 1 week ago

49 people died in Niger Republic : ఆఫ్రికా ఖండంలోని నైజర్ దేశ పరిధిలో ఉన్న సహారా ఎడారిలో గుండెల్ని పిండేసే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక లారీలో ప్రయాణిస్తున్న 51 మంది ప్రయాణికులు ఎడారి గుండా వెళ్తుండగా, ఒక్కసారిగా వాహనం నడిరోడ్డుపై (ఎడారి మధ్యలో) చెడిపోయింది.

చుట్టుపక్కల మైళ్ల దూరం వరకు ఎలాంటి మానవ సంచారం గానీ, నీటి వనరులు గానీ లేకపోవడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. ఎండ తీవ్రతకు తోడు, వరుసగా మూడు రోజుల పాటు తాగడానికి బొట్టు నీరు కూడా దొరక్కపోవడంతో 49 మంది ప్రయాణికులు విలవిలలాడుతూ ఎడారిలోనే ప్రాణాలు విడిచారు. మృతులంతా ఒక పండుగ వేడుకల కోసం పొరుగు దేశమైన మాలికి వెళ్లి, తిరిగి తమ స్వస్థలాలకు వస్తుండగా ఈ ఘోర దుర్ఘటన ఎదురైంది.

Read ALso : ట్రంప్ ను శాంతిదూతగా అభివర్ణించిన షరీఫ్‌..నిధుల కోసం కొత్త డ్రామా

80 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు దక్కించుకున్న ఇద్దరు

ఈ భీకర విపత్తు నుంచి కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే అత్యంత సాహసోపేతంగా ప్రాణాలతో బయటపడగలిగారు. తమ కళ్ల ముందే తోటి ప్రయాణికులు ప్రాణాలు విడుస్తున్నా ఏమీ చేయలేని స్థితిలో, వారు ప్రాణాలు చేతబట్టుకుని సహాయం కోసం ఎడారి ఇసుక తిన్నెల్లో దాదాపు 80 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించారు. ఎట్టకేలకు ఒక సమీప పట్టణానికి చేరుకుని, అక్కడి స్థానిక అధికారులకు తాము ఎదుర్కొన్న నరకాన్ని వివరించారు. వారిచ్చిన సమాచారంతో దిగ్భ్రాంతికి గురైన రెస్క్యూ టీమ్స్ మరియు భద్రతా దళాలు తక్షణమే రంగంలోకి దిగి ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోవడంతో, ఎడారి మధ్యలో చెడిపోయిన లారీ పరిసరాల్లో 49 మంది నిర్జీవ దేహాలు కుప్పలుగా పడి ఉండటం చూసి అధికారులు చలించిపోయారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha