Dailyhunt
సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన జనగామ ఎమ్మెల్యే

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన జనగామ ఎమ్మెల్యే

వార్త 1 week ago

Palla Rajeshwar Reddy: సామాన్యులనే కాకుండా ప్రజాప్రతినిధులను కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. తాజాగా జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయారు.

కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో నమ్మబలికిన ఓ కేటుగాడు ఆయన నుంచి లక్ష రూపాయలు కాజేశాడు.

Read also: Mailardevpally Snack unit Raid: స్నాక్స్ తింటున్నారా? అయితే ఈ షాకింగ్ వీడియో చూడాల్సిందే!

Palla Rajeshwar Reddy: మోసం జరిగిందిలా..

నిందితుడు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి, తాను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు. "వికసిత్ భారత్" పథకం కింద అర్హులైన వారికి రూ. 10 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికాడు. మీ నియోజకవర్గంలోని అర్హుల జాబితా పంపిస్తే వారికి ఈ రుణాలు మంజూరు చేస్తామని నమ్మించాడు.

 Janagama MLA duped by cyber fraudsters

నిందితుడి మాటలు నమ్మిన ఎమ్మెల్యే, ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక్కొక్కరికి రూ. 2,500 చొప్పున మొత్తం రూ. లక్షను నిందితుడు సూచించిన నంబర్‌కు ఫోన్ పే (PhonePe) ద్వారా పంపారు. అయితే, ఆ తర్వాత నిందితుడు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో ఎమ్మెల్యేకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా తాను మోసపోయానని గ్రహించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు.. దర్యాప్తు ప్రారంభం

ఈ ఘటనపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి ఫోన్ నంబర్, లావాదేవీల వివరాలను పోలీసులకు అందించారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం సహాయంతో నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. చదువుకున్న వారు, సెలబ్రిటీలు కూడా ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మ్యాట్రిమోనీ పెళ్లి.. చివరకు ప్రాణాల మీదకు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha