Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సమంత ప్రెగ్నెన్సీపై దర్శకురాలు నందిని రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

సమంత ప్రెగ్నెన్సీపై దర్శకురాలు నందిని రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

వార్త 1 week ago

Nandini Reddy interview: స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తన ప్రెగ్నెన్సీ వార్తను అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె నటించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్‌లో తాను గర్భవతిని అనే విషయాన్ని స్వయంగా వెల్లడించింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా ట్రెండ్ అవుతుండగా, ఈ సినిమా దర్శకురాలు నందిని రెడ్డి సమంత ప్రెగ్నెన్సీపై చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Read also: Baahubali 3 Movie Update:గ్లోబల్ వైడ్‌గా షేక్ చేస్తున్న ప్రభాస్ సిగ్నల్.. మాహిష్మతి సామ్రాజ్యం మళ్లీ వస్తోందా?

 Director Nandini Reddy makes interesting comments on Samantha’s pregnancy.

Nandini Reddy interview: షూటింగ్ సమయంలోనే ప్రెగ్నెన్సీ.. చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ!

సమంత గర్భవతి అనే విషయం ప్రపంచానికి తెలియకముందే తనకు తెలుసని నందిని రెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు నందిని రెడ్డి స్పందిస్తూ.. “సినిమాలోని ‘తస్సదియ్య’ పాట చిత్రీకరణ సమయంలోనే సమంత గర్భవతి అనే విషయం నాకు తెలిసింది. అదృష్టవశాత్తూ అప్పటికే భారీ యాక్షన్ సన్నివేశాల షూటింగ్ అంతా పూర్తయింది. ఆ తర్వాత మిగిలిన టాకీ పార్ట్, సాంగ్స్ చిత్రీకరణ సమయంలో సమంత ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొత్తం యూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రతి సీన్‌ను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి షూట్ చేశాం” అని తెలిపారు.

ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటికీ ఎక్కడా సినిమా షూటింగ్‌కు ఆటంకం కలగకుండా, ఎంతో బాధ్యతగా తన వర్క్‌ను పూర్తి చేసిన సమంత అంకితభావాన్ని చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ‘మా ఇంటి బంగారం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి సమంత కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. మయోసైటిస్ చికిత్స తర్వాత హీరోయిన్‌గా ఆమెకు ఇది ఒక పవర్‌ఫుల్ సక్సెస్‌ఫుల్ కంబ్యాక్‌గా నిలిచిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

సినిమాలకు తాత్కాలిక విరామం..

ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమా పనులన్నింటినీ పూర్తి చేసిన సమంత.. కొద్దికాలం పాటు వెండితెరకు విరామం ప్రకటించనుంది. తన జీవితంలో ప్రారంభం కాబోతున్న ఈ కొత్త అధ్యాయం కోసం, కుటుంబంతో సమయం గడిపేందుకు ఆమె ప్రసూతి సెలవులు (Maternity Leave) తీసుకోబోతోంది. ఈ సెలవుల అనంతరం సరికొత్త ప్రాజెక్టులతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తానని సమంత ఇప్పటికే స్పష్టం చేయడంతో, ఆమె రీఎంట్రీ కోసం అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గోవాలో ఖుష్బూ కూతురి పెళ్లి.. పంచెకట్టులో టాలీవుడ్ సీనియర్ హీరోల సందడి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha