Public health protection :ఆరోగ్యవంతమైన ప్రజలే ఏ దేశానికైనా వెన్నెముక . నేడు ఆ వెన్నముక మనదేశంలో వయస్సు తో నిమిత్తం లేకుండా అనేక రకాల వ్యాధులతో అష్ట వంకర్లు తిరిగిపోతోంది.
అరిగి అనారోగ్యం పాలవుతోంది. వైద్యం, శస్త్ర చికి త్సల, ఆర్థికభారం తప్పడంలేదు. ఈ భారాలు ధనిక, పేద బేధం లేకుండా జీవన ప్రమాణాలను కృంగతీస్తున్నాయి. నేటి మనిషి ఆయుషు అయితే పెరిగింది గాని, ఆరోగ్యకర జీవనం అయితే ఉండడం లేదు. సంపాదనలో ఆహారం కోసం ఎంత ఖర్చు చేస్తున్నామో, ఆరోగ్యం కోసం కూడా అంత ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం శాస్త్ర, సాంకేతికతల ఆధా రంగా ప్రపంచవ్యాప్త సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం సంఘటితమవుదాం!’ అనే నినాదాన్ని ఇచ్చింది. కేవలం మనుషుల పైనే దృష్టి పెడితే ఆరోగ్య పరిరక్షణ సాధ్యం కాదని, అడవులు, చెట్లు, జంతు జాలాల పరిరక్షణతో పర్యావరణ పరిరక్షణ ద్వారానే మనిషి ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని ఈ నినాదం లక్ష్యాలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తోంది. ఏ దేశ ప్రజల ఆరోగ్యానికయినా స్థూలంగా నాలుగు రకాల ముప్పులు పొంచి ఉన్నాయి. నేడు వయసుతో సంబంధం లేకుండా వస్తోన్న అంటు వ్యాధులు (కమ్యూనికబుల్ డిసీజెస్ ), అంటువ్యాధులు కాని వ్యాధులు (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్), పుట్టుకతో జన్యు వుల ద్వారా, అవయవ నిర్మాణ లోపాల కారణంగా వస్తున్న వ్యాధులు, వయస్సు పెరుగుదలతో వచ్చే వృద్ధాప్య వ్యాధు లు. వీటినే డీ జనరేటివ్ డిసీజెస్ అని కూడా అనవచ్చు. నేడు వృద్ధాప్య వ్యాధుల్లో కూడా కొన్ని నియంత్రించవచ్చు. కొన్నింటికి తగిన చికిత్స, జాగ్రత్తలతో అధిగమించి ఆరోగ్య కర జీవితం పొందవచ్చు.
Read Also: Liquor Bottles Shortage: దేశంలో మద్యం బాటిళ్ల తయారీ 40 శాతం తగ్గుదల
Public health protection
Public health protection :సీజన్ల లో ఆయా వ్యాధులు
మన దేశ ప్రజారోగ్యపరిస్థితుల విషయానికొస్తే పరాన్నజీవ (పారాసైటిక్), బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ అంటువ్యాధులు తగ్గినట్లు కనిపిస్తున్న వ్యాప్తి మాత్రం జరుగుతూనే ఉంది. కొన్ని రాష్ట్రాలలో కొన్ని సీజన్ల లో ఆయా వ్యాధులు విజృంభిస్తూనే ఉన్నాయి. కరోనాలా అవి విరుచుకుపడనందున మనం వాటిపై దృష్టి సారించ డం లేదు. పరాన్న జీవవ్యాధుల్లో ఇంకా మలేరియా మర ణాలు సంభవిస్తూనే ఉన్నాయి. బ్యాక్టీరియల్ వ్యాధుల్లో టైఫాయిడ్, నిమోనియా, ఆంత్రాక్స్, మెలిడీయోసిస్, స్క్రబ్ టైపస్ వంటి వ్యాధుల్ని చూస్తూనే ఉన్నాం. క్షయ వ్యాధి వ్యాప్తి వేగం పెరుగుతుందని ప్రభుత్వ గణాంక వివరాలే తెలుపుతున్నాయి. ఫంగల్ వ్యాధుల వల్ల కూడా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోన, డెంగు, చికెన్ ఫాక్స్, చికెన్ గునియా, ఎన్ సెఫిలైటిస్, నిఫా, బర్డూ, మీజిల్స్ వంటి వ్యాధులతోపాటు ప్రమాదకర హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైట్ సి వంటి వైరల్ వ్యాధులు ఆరోగ్య సమస్యల్ని సృష్టిస్తూనే ఉన్నాయి. ఇటీవల ప్రమాదకర హెచ్ఐవి, హెప టైటిస్ బి, సి వైరస్ల వ్యాప్తి వేగంగా పెరుగుతుందని చెప్ప క తప్పదు. అంటు వ్యాధులలో వైరల్ వ్యాధులకు తప్ప మిగతా అన్నిరకాల వ్యాధులకు పూర్తిచికిత్స ఉన్నా, మరణా లు సంభవించడం మనఆరోగ్య వ్యవస్థ విఫలత్వానికి నిదర్శనం. అంటు వ్యాధులు కాని వ్యాధుల విషయానికొస్తే దేశవ్యాప్తంగా మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇవి జీవిత కాలం క్రమం తప్పకుండా మందులు వాడాల్సిన దీర్ఘకాల వ్యాధులు కావడంతో ప్రజలపై ఎంతో ఆర్థిక భారం పడు తుంది.
శాస్త్రీయ అవగాహన తప్పని సరి
ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, అగ్ని, రోడ్డు ప్రమాదాల వల్ల కూడా ప్రజల ఆరోగ్యానికి భంగం కలికి స్తున్నాయి. ఫలితంగా జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. పుట్టుకతో జన్యుపరంగా వచ్చే వ్యాధులు, అవయవనిర్మాణ లోపాలతో పుట్టే శిశువుల సంఖ్య నేడు పెరిగిపోతుంది. పుట్టినప్పటినుండే వారిని సాకటం తల్లిదండ్రులకు ఎంతో భారంగా మారుతుంది.అందుకు ఇటీవల ఆర్థిక సహాయం కోరుతున్న స్పైనల్ మస్కలర్ అట్రోఫీ కేసులే నిదర్శనం. 16 కోట్లు విలువ చేసే ఒక ఇంజక్షన్ కోసం తల్లిదండ్రుల పాట్లు వర్ణనాతీతం ప్రజారోగ్య చైతన్యం, పరిసరాల పరిశుభ్ర త, వైద్యసదుపాయాల కొరత వంటి ప్రధాన అంశాలలో ప్రజలు, ప్రభుత్వం సంయుక్తంగాకృషి చేస్తేనే మంచిఫలితాలు సాధించగలం. నేడు ప్రజలందరికీ పౌష్టిక ఆహారం, వ్యాధుల వ్యాప్తికిగల కారణాలు, నియంత్రణ, నిరోధక చర్యలు, ముందు జాగ్రత్తలు తదితర విషయాల్లో శాస్త్రీయ అవగాహన తప్పని సరి. పాఠశాలస్థాయి నుండే ఆరోగ్య పరిరక్షణ చర్యలను పాఠ్యాంశాలుగా పెట్టి అధ్యయం చేయించడం ద్వారా శాస్త్రీ య అవగాహన చిన్న వయస్సు నుండే తీసుకురావాలి. వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండేలా వారిలో చైతన్యం రావాలి. నేటిసమాజంలో ఎవరికి వారు తమదాకా వచ్చేదాకా పట్టిం చుకోని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వ్యాధుల నిరోధం ఒకసామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క పౌరుడు స్వీకరించాలి. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వబాధ్యత ఎంతోఉంది. ప్రజా రోగ్యం కోసం చేపట్టే పథకాలు, కార్యక్రమాలన్నీ కాగితాలలో చూపినట్టుగా వాస్తవంలో ఉండడం లేదు. ప్రస్తుతం అలా ఉండే పరిస్థితులు కూడా సమాజంలో లేవు.
Public health protection
పరిసరాల పరిశుభ్రత
ఆరోగ్యం రాష్ట్ర జాబితాలోదే అయినా, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ప్రత్యక్షంగా ప్రవేశించి సమాజంలో కొంత గందరగోళ పరి స్థితులకు దారితీస్తున్నాయి. వైద్య, ఆరోగ్య, విద్యలో ప్రజా రోగ్యంపై ఎంతో ప్రాధాన్యత గల సోషల్ అండ్ ప్రివెంటివ్మెడిసిన్ (ఎస్.పి.ఎం) ప్రజారోగ్య వైద్య విభాగం ప్రభుత్వ స్థాయిలో, వైద్య కళాశాలల స్థాయిలో, విభాగ స్థాయిలో తీవ్ర నిర్లక్ష్యానికి గుర వుతోంది. వైద్య విద్యార్థులు ఆ విభాగానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఉత్తీర్ణత అయితే చాలు అనుకుంటున్నారు. చాలా వైద్యకళాశాలలోని ఈవైద్య విభా గంలో వైద్య విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా, ప్రాధాన్యత ను గుర్తించి చెప్పే అధ్యాపకులు కరువవుతున్నారు. దేశంలో పెరిగిపోతున్న అంటు వ్యాధులకు మూలకారణం పరిసరాల పరిశుభ్రత. ఇందుకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎక్కడబడితే అక్కడ చెత్త చెదారం వేసి మనపరిసరాలను మనమే అపరి శుభ్రం చేసుకుంటున్నాం. సురక్షిత మంచి నీరు, పరిసరాల పరిశుభ్రత ద్వారా ఎన్నో అంటువ్యాధుల్ని పూర్తిగా నిరోధించవచ్చు. ఆహారంలోని కల్తీలు ప్రజారోగ్యా న్ని తీవ్రంగా బల హీనపరుస్తున్నాయి. అప్పుడప్పుడు మర ణాలు కూడా సంభవి స్తున్నాయంటే కల్తీలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు.
-డాక్టర్ టి. సేవకుమార్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
కిమ్స్ ఆసుపత్రికి ఊపిరితిత్తుల తరలింపు.. పోలీసుల సూపర్ ఫాస్ట్ యాక్షన్

