Minor Alleged Ritual Abuse : ఆర్థికంగా త్వరగా సంపన్నులవుతారనే మాయమాటలు నమ్మించి ఒక బాలికను పూజల పేరుతో తీవ్ర లైంగిక వేధింపులకు గురిచేసిన దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసింది.
వైఎస్సార్ కడప జిల్లాలో నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ కేసును అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
Minor Alleged Ritual Abuse
Minor Alleged Ritual Abuse : రహస్య ప్రదేశంలో పూజలు
అనంతపురంలో హోటల్ వ్యాపారం చేసుకుంటున్న కుటుంబానికి మహాలక్ష్మి అనే మహిళ పరిచయమైంది. త్వరగా సంపన్నులు కావచ్చని, కుమార్తెను వివస్త్రగా చేసి పూజలు నిర్వహించాలని నమ్మించింది. హేమంత్ అనే వ్యక్తి బాలికను రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి పూజల పేరుతో అశ్లీలంగా ప్రవర్తించాడు. అనంతరం ఆగస్టు 8న అతడి కుమారుడు బాలసుబ్రహ్మణ్యం, విజయ్‌కుమార్‌లతో కలసి మళ్లీ అదే దారుణానికి ఒడిగట్టారు. ఆగస్టు 9న బాధితులను వైఎస్సార్ కడప జిల్లాకు తరలించి, వెంకటేశ్ యాదవ్ అనే మరొక దొంగ గురువుతో కలిసి పూజల పేరిట బాలికను తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. ఆగస్టు 11న అనుమానాస్పదంగా కారులో తీసుకెళ్తుండగా స్థానికులు గమనించడంతో నిందితులు పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో వల్లూరు పోలీసులు కేసు నమోదు చేయగా, ప్రస్తుతం అనంతపురం వన్‌టౌన్ పోలీసులు మహాలక్ష్మి, హేమంత్, బాలసుబ్రహ్మణ్యం, వెంకటేశ్ యాదవ్‌లపై పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేశారు.
కాకినాడలో దారుణం: వివాహేతర సంబంధం కారణంగా జిమ్ ట్రైనర్ కిరాతక హత్య!

