Dailyhunt
సముద్రంపై ట్రంప్ సుంకం..?

సముద్రంపై ట్రంప్ సుంకం..?

వార్త 1 week ago

మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) పై టోల్ సుంకం విధించే యోచనలో ఉండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని రేపుతోంది.

ప్రపంచ ముడి చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిపై టోల్ వసూలు చేసేందుకు ఇరాన్‌తో జాయింట్ వెంచర్ చేపట్టాలని ట్రంప్ ప్రతిపాదించారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ ప్రతిపాదన తెరపైకి రావడం గమనార్హం. ఈ మార్గం గుండా వెళ్లే నౌకల భద్రతను పర్యవేక్షిస్తూనే, భారీగా ఆదాయం గడించవచ్చని ఆయన భావిస్తున్నారు. మొదట్లో అమెరికా స్వతంత్రంగా టోల్ విధించాలని భావించినప్పటికీ, ఇప్పుడు ఇరాన్ ఏర్పాటు చేయబోయే టోల్ బూత్ వ్యవస్థలో భాగస్వామి కావడానికి మొగ్గు చూపుతున్నారు. యుద్ధం తర్వాత పునర్నిర్మాణ పనుల కోసం ఈ నిధులను వాడుకోవాలని ఇరాన్ యోచిస్తోంది.

Read Also : Fire at Mumbai Airport: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!

 Donald Trump

సొంత ప్రభుత్వం నుంచే తీవ్ర వ్యతిరేకత

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికా ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇది “అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం” మరియు “ప్రపంచ వాణిజ్యానికి ప్రమాదకరం” అని హెచ్చరించారు. దీనివల్ల ఇంధన ధరలు ఆకాశాన్నంటుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ స్పందిస్తూ, ఇది ఒక “బలహీనమైన సంధి” అని, ఇరాన్ నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భద్రత కంటే ఆర్థిక లాభాలకే ప్రాధాన్యత ఇవ్వడంపై అమెరికా పాలనా యంత్రాంగంలో చర్చ జరుగుతోంది.

టోల్ ప్లాన్ అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు

ఈ టోల్ ప్లాన్ అమెరికా రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలనే సృష్టించింది. ఇరాన్ పట్ల ట్రంప్ అనుసరిస్తున్న తీరును తప్పుబడుతూ ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా 25వ సవరణ ద్వారా ఆయన్ని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంతో పాటు, అభిశంసన తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, సముద్ర మార్గాలపై నియంత్రణ సాధించి ఆదాయాన్ని పెంచుకోవాలనే ట్రంప్ ‘బిజినెస్ మైండ్‌సెట్’ ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాలను ఒక కొత్త మలుపు తిప్పేలా కనిపిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha