Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంజయ్ దత్‌పై అభిమానాన్ని చాటుకున్న సల్మాన్ ఖాన్.. భావోద్వేగ పోస్ట్ వైరల్

సంజయ్ దత్‌పై అభిమానాన్ని చాటుకున్న సల్మాన్ ఖాన్.. భావోద్వేగ పోస్ట్ వైరల్

వార్త 1 week ago

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన ఆత్మీయ మిత్రుడు, సీనియర్ నటుడు సంజయ్ దత్ పట్ల తనకున్న అపారమైన ప్రేమను మరోసారి చాటుకున్నారు.

ఇటీవలే జూలై 29న సంజయ్ దత్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగ్గా, తాజాగా ఆయనను కలిసిన సల్మాన్ ఖాన్ గాఢంగా కౌగిలించుకున్న అరుదైన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ అపూర్వ కలయికకు సంబంధించిన రెండు ఫొటోలను షేర్ చేయడమే కాకుండా, బ్యాక్‌గ్రౌండ్‌లో వీరిద్దరూ కలసి నటించిన ఐకానిక్ సినిమా ‘చల్ మేరే భాయ్’ చిత్రంలోని పాటకు సంబంధించిన మ్యూజిక్‌ను జోడించి మరింత ఎమోషనల్ టచ్ ఇచ్చారు. దశాబ్దాలుగా వీరు కొనసాగిస్తున్న స్నేహ బంధంపై అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.

Salman Khan: “బాబా ఎప్పటికీ బాబానే” – సల్మాన్ ఖాన్ ఎమోషనల్ సందేశం

ఈ ఫొటోలతో పాటు సల్మాన్ ఖాన్ రాసిన అందమైన సందేశం ప్రస్తుతం అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. “బాబా ఎప్పటికీ బాబానే. సంజూ బాబా మనందరికీ బాబా. నా పెద్ద అన్నయ్య సంజయ్ దత్. అల్లా, భగవాన్, జీసస్… దేవుళ్లందరూ ఈ మంచి మనిషిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే భాయ్.. ఐ లవ్ యూ బాబా” అంటూ సల్మాన్ చాలా ఆప్యాయంగా రాసుకొచ్చారు.

సల్మాన్ పెట్టిన ఈ పోస్ట్‌పై సంజయ్ దత్ సతీమణి మాన్యతా దత్ స్పందిస్తూ ‘జీవితాంతం సోదరులే’ అని కామెంట్ చేయగా, సంజయ్ దత్ కుమార్తె త్రిశాలా దత్ హార్ట్ ఎమోజీలతో తమ ఆనందాన్ని, ప్రేమను వ్యక్తం చేశారు. గతంలో ‘సాజన్’, ‘చల్ మేరే భాయ్’, ‘యే హై జల్వా’ వంటి చిత్రాలతో అలరించిన ఈ ఐకానిక్ కాంబినేషన్‌ను మళ్లీ వెండితెరపై ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ఉందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ కోరికను బయటపెడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha