Choutakur News: ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేలా ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి వసంతకుమారి సూచించారు.
99 రోజులు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఎంపీడీవో కె.శంకర్ అధ్యక్షతన చౌటకూరు రైతు వేదికలో సర్పంచులు, ఉప సర్పంచులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Read Also: Lok Sabha Three Bills : లోక్‌సభ ముందుకు మూడు కీలక బిల్లులు

ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికను తయారు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. పథకాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అర్హులందరికీ అన్ని పథకాలు వర్తింప చేస్తామని పేర్కొన్నారు. త్వరలో అల్పాహారం, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ వరకు విస్తరణ, దివ్యాంగం విద్యార్థులకు మోటర్ వాహనాలు పంపిణీ, పంటల వైవిధ్యీకరణ, సహజ సేంద్రియ వ్యవసాయం పథకాల గురించి వివరించారు.

తమ పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్ది, మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. వివిధ మండల స్థాయి అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నామాల కిష్టయ్య, ఎస్ఐ నల్లా విశ్వజన్, ఎంపీఓ సువర్ణ, ఏవో ప్రవీణ, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ నాగసాయి, ట్రాన్స్ కో ఏఈ సాయి రాఘవ, వెటర్నరీ, ఆయుష్ హాస్పిటల్ డాక్టర్లు, విశాల్, సబిత, ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు అమృతవాణి,మోహన్ రెడ్డి, ఐకేపీ సీసీ చంద్రశేఖర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
గ్రేటర్ హైదరాబాద్‌లో సీట్ల జాతర: డీలిమిటేషన్‌తో మారనున్న భాగ్యనగర ముఖచిత్రం!

