Rice millers:సన్న బియ్యం సరఫరాలో మోసం వెలుగుచూసింది. ఎఫ్‌సీఐకి సన్న బియ్యం ఇవ్వవలసి ఉండగా దొడ్డు బియ్యం ఇచ్చినందుకు సీఐడీ 14 మంది రైస్ మిల్లర్లను అరెస్ట్ చేసింది.
నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి భారీ మోసానికి పాల్పడిన వారిపై 3 క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Telangana El Nino: ఎల్‌నినోపై ప్రభుత్వం ఫోకస్.. 28న అన్ని పార్టీలతో సమావేశం
Fraud in the supply of fine-quality rice
ఎఫ్‌సీఐకి సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం
తెలంగాణలో ఎఫ్‌సీఐకి బియ్యం ఇస్తున్న క్రమంలో భారీ కుంభకోణం బయటపడింది. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో నాణ్యమైన సన్న రకం బియ్యాన్ని ఇవ్వవలసి ఉండగా, కొందరు మిల్లర్లు ఆ ధాన్యాన్ని మార్కెట్లో అమ్మేశారు. దానికి బదులుగా వేరే రాష్ట్రాల నుంచి తక్కువ ధరగల దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేసి అందించారు. పౌరసరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ ఈ నెల 24న ఫిర్యాదు చేయగా, ల్యాబ్ పరీక్షల్లో ఈ బియ్యం నిర్దేశిత రకం కాదని తేలింది.
Rice millers:కోట్ల రూపాయల నష్టం
ఈ మోసం వల్ల ప్రభుత్వానికి బోనస్ రూపంలో 1.69 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సుమారు 16 రైస్ మిల్లులు 3,385 టన్నుల దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసినట్లు తేలింది. అయితే అధికారులు సకాలంలో స్పందించి సేకరణను నిలిపివేయడంతో 242 కోట్ల రూపాయల భారీ ఆర్థిక నష్టం తప్పుింది. ఈ కుట్రలో అధికారుల ప్రమేయం కోణంలో సీఐడీ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
Epaper: epaper.vaartha.com

