Telangana Paddy Bonus: వానాకాలం సీజన్‌లో సన్న వడ్లను సాగు చేస్తున్న తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ కీలక సమాచారం ఇచ్చింది. సన్న ధాన్యానికి ప్రభుత్వం అందిస్తున్న క్వింటాల్‌కు రూ.500 బోనస్ కోసం సాగు వివరాల నమోదు గడువును ఈ నెల 17 వరకు పొడిగించింది.
ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు రకాల సన్న ధాన్యానికి మాత్రమే ఈ బోనస్ వర్తించనుంది. అర్హత పొందేందుకు రైతులు తమ పంట, సాగు వివరాలను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
Read Also :Telangana Cheyutha Pensions: చేయూత పింఛన్ల దరఖాస్తుకు నేడే తుది గడువు

వివరాలు సరిపోలితేనే బోనస్
రైతులు విత్తన డీలర్ల వద్ద కొనుగోలు చేసిన విత్తనాల వివరాలతో పాటు పంట సాగుకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. డీలర్ల వద్ద ఉన్న కొనుగోలు వివరాలు, రైతులు నమోదు చేసిన పంట వివరాలు సరిపోలిన తర్వాతే బోనస్ చెల్లింపు జరుగుతుంది. సన్న వడ్ల బోనస్ విషయంలో అక్రమాలను అరికట్టడంతో పాటు అర్హులైన రైతులకే ప్రయోజనం అందించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాగు వివరాల నమోదు ద్వారా బోనస్ చెల్లింపుల్లో పారదర్శకత పెంచే అవకాశం ఉంది.
Telangana Paddy Bonus: సన్నాల సాగు విస్తీర్ణం పెరుగుతోంది
రూ.500 బోనస్ అందిస్తుండటంతో రాష్ట్రంలో సన్న వడ్ల సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. రైతులు గడువులోగా తమ సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది.

