Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సర్ మెలికల కొలికి!

సర్ మెలికల కొలికి!

వార్త 3 weeks ago

SIR : ఓ టుహక్కు నవ్వులపాలవుతోంది. గడపగడపకూ, బిఎల్ ఒలను పంపి విస్తృత పరిశీలన తర్వాతసమగ్ర ఓటర్ల జాబితా రూపొందించాలన్న 'సర్' లక్ష్యాన్ని ఎవరూ కాదనలేం.

కానీ దాని లక్ష్యం నెరవేరే స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు ఉండకపోవడం విచిత్రం. రాజ్యాంగానికి ఎన్నో సవరణలు చేసుకున్నప్పుడు మన మెందుకు సవరణ చేసుకోకూడదు అనుకున్నారో ఏమో కానీ సమగ్ర విధాన రూపకల్పన లేకుండా ‘సర్’ విధా నాలున్నాయేమోననే అనుమానాలు జనంలో తలెత్తుతు న్నాయి. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ తీరు ఎంతో ఘనంగా సాగుతోందనే ప్రచారం జరుగుతోంది. కానీ క్షేత్రస్థాయిలో మరోలా ఉంది. ఓటరు చేర్పులో వయోజ నులు సైతం ఇబ్బందిపడుతున్నారు. ఎందుకంటే ఇంటింటికీ తిరుగుతున్న బిఎల్ ఒలు చాలా ఇళ్లలో అంతకుముం దున్న ఓటరు అక్కడ ఉన్నారా? లేరా? అనే పరిశీలన తప్పించి చాలా ప్రాంతాల్లో సంబంధిత కొత్త ఓటర్ల చేర్చింపు సజావుగా సాగడం లేదు. ఫలానా చోట ఫలానా వారు లేరనే సమాచారం రాగానే వాళ్ల ఓటు తొలగిస్తు న్నారు తప్పితే వారి విషయమై అనంతర ఆచూకీ తీసు కోలేకపోతున్నారు.

 SIR

SIR : ఆది నుంచీ వివాదాస్ప దం

‘సర్’ ప్రక్రియ ఆది నుంచీ వివాదాస్ప దంగానే ఉంది. సర్ ప్రక్రియ పట్ల జనం భయభ్రాంతు లౌతున్నారు. ఏదో ఎన్నికలప్పుడే ఓటు అనే పరిస్థితి నుంచి ఓటు హక్కు లేకుంటే ఓ సమస్య, రెండు చోట్ల నమోదై ఉంటే ఓ తకరారు. ఇలా సామాన్య ప్రజానీకం ఉలిక్కిపడి ఆందోళనపడుతున్నారు. ఎన్నికలు కొద్ది రోజుల్లో వస్తాయనగా బీహార్, పశ్చిమబెంగాల్, తమిళ నాడు, కేరళ వంటి రాష్ట్రాలలో ఆదరాబాదరా ‘సర్’ పరి శీలన జరిగిందంటే అది వేరే విషయం. పైగా ఓట్లు అన్యాయంగా ఏరివేత కోసమే ఈ ప్రక్రియ ఆనో, తీరా తుది జాబితా పూర్తయ్యాక తమఓట్లు గల్లంతయ్యాయని ఆందోళన చెందిన సాధారణ జనం లేకపోలేరు. అంటే ‘కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక పోయిం దన్న చందాన ఈ ప్రక్రియసాగుతోంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇప్పట్లో ఎన్నికలు లేవు. అయినా ‘సర్’ ప్రక్రియ సజావుగా సాగడం లేదనే సందేహాలు ఉ త్పన్నమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రక్రియ మంగళవారంతో పూర్తయింది. 89శాతంబిఎల్ ఒ ల పరిశీలన పూర్తయిందని చెప్తున్నా రాష్ట్ర ఎన్నికల కమి షనర్ విజ్ఞప్తి మేరకు మరో పదిరోజులు పెంచారు.

ఓటరు చేర్చింపు ప్రక్రియ ఈసారి చాలా సంక్లిష్టం

తెలం గాణలో ‘సర్కు సంబంధించిన నిబంధనలేవీ అమలు చేయడం లేదు. ఇంటింటికి మూడుసార్లు సందర్శించా ల్సిన బిఎల్లు తమ ప్రాంతానికే రావడం లేదని ఆరో పణలున్నాయి. వాళ్లలా అంటున్నారని కాదు కానీ ఇంత తక్కువ సమయంలో బిఎల్ఎలు ఒకసారే ఫలానా ఏరియాకు వెళ్లలేదనే సమాచారం ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లిన వారెందరో ఉన్నారు. తాజా ప్రక్రియలో ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కున్నట్లయితే రెండేళ్ల జైలు శిక్ష తప్పదంటూ ఎన్నికల కమిషన్ ప్రకటన చేసే సరికి చాలా మంది ఓటర్లకు తమకెక్కడ ఓటుందో తెలుసుకునే సమ యం, వీలు చిక్కక వెతుక్కుని ఉండకపోతే వ్యక్తిగతంగా చిక్కుల్లో వడినట్లే కదా! నిరక్షరాస్యులు తమ పనులమీద వేరొకచోటకి వెళ్లి ఉన్నా, అసంఘటిత కార్మికులైన వారి ఓటర్ల పరిశీలన ఎంతో సంక్లిష్టంగా మారుతోంది. ఇలాంటి ఎన్నో అంశాల్లో పరిశీలన తేలకపోతే ఎందరివో ఓట్లు తొలగింపునకు గురయ్యే పరిస్థితిఏర్పడ్తుంది. సాధారణం గా కొత్త ఓటర్లను చేరమని, ఇళ్లు మారిన వారి ఓట్లను కొత్త చోట్లకు మార్చుకోమని ఆహ్వనించే ఓటరు చేర్చింపు ప్రక్రియ ఈసారి చాలా సంక్లిష్టంగా మారింది. ఎన్నో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా డబ్లింగ్ ఓటరుల పరిశీలన సర్దుబాటు చేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఎందుకు వినియోగంలోకి తెచ్చుకోవ డం లేదో అర్థంకాదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా విశ్వసనీయత అవసరమే. దానికోసం రూ. పొందించిన ‘సర్’ ప్రక్రియలో పారదర్శకతను బలో పేతం చేయాల్సిన అవశ్యకత ఉంది.

 SIR

సరైన ప్రామాణిక అవగాహనకల్పించకుండా ..

అనర్హులను, నకిలీ నమోదును నిలిపివేసేందుకు తగు మార్పులు చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారాన్ని అందుకోవడం అవసరం. వలస కార్మికులు, వృద్ధులు, దివ్యాంగులు సైతం కొత్త ఓటరు జాబితాలోకి నమోదయ్యే విషయంలో ఎక్కువ ఇబ్బందులకు గురవుతున్నారని సమాచారం. బిఎల్కలకు సరైన ప్రామాణిక అవగాహనకల్పించకుండా ఎన్యూమరేషన్కు వంపడం వల్లనే ఈ ప్రక్రియ విమర్శలకు గురవుతోంది. వివిధ ప్రాంతాల్లో వేర్వేరు రాజకీయ పార్టీలు ఓటర్ల చేర్చింపు, తొలగింపులతో సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టే అంశాలపై గొంతెత్తి విమర్శి స్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసాన్ని బల పరిచే ప్రక్రియ పురోగతిలో ఎన్నో అంశాలపై ఎన్నికల సంఘం ఎన్నో మెలికలు పెడుతోందనే అభిప్రాయంవ్యక్త మవుతోంది. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, వలసలు, డిజిటల్ యుగంలో మారుతున్న నివాస పరి స్థితుల రీత్యా సమగ్ర సవరణలను కాదనలేం. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా మాయాజాలం జరిగిందా అనే అనుమానాలను రేకెత్తించే అంశాలపై ఓటర్ల జాబితా నిర్దే శకులకు స్పష్టత అవసరం. అనేక ప్రాంతాల్లో పత్రాల ధృవీకరణపై ప్రజల్లో అయోమయం ఏర్పడింది. ఇప్పుడీ ప్రక్రియలో ఆధార్ కార్డు, పౌరసత్వ కార్డు, పాత ఓటరు కార్డు, ఇలాంటివన్నీ ఎక్కడో ఓ దేశంలో ఇక్కట్ల పాలు చేస్తాయనే చర్చ బయలుదేరడంతో జనం చివరి క్షణంలో కంగారుపడిన వైనం. ఓటర్ల జాబితా సర్దుబాటు లో రాజకీయ పార్టీలు తాము గాబరా చెంది ఓటర్లను గందర గోళంలో పడేటట్లు చేయడం కన్నా అన్ని విధాలా సహకరిస్తే ఎన్నికల కమిషన్ బాధ్యతలో సమగ్ర జాబితా రూపొందించగలుగుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి నిర్ణయం లేదు: శరద్ పవార్ మద్దతు వార్తలపై సుప్రియా సూలే క్లారిటీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha