Telangana mri services:తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వ దవాఖానల్లో పీపీపీ మోడల్‌లో ప్రైవేట్ MRI సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో ఎంఆర్ఐ యంత్రాల నిర్వహణ సరిగా లేక రోగులు ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యను పూర్తిగా తొలగించడానికి వైద్య ఆరోగ్య శాఖ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానాన్ని తీసుకువస్తోంది. దీని ద్వారా నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. తొలి దశలో మూడు జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేసి క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read also: Telangana SIR Voter List: సవరణ గడువు నేడే ఆఖరు..ఓటర్లకు చివరి అవకాశం!
Private MRI services under the PPP model
మూడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
రాష్ట్రంలోని నిజామాబాద్, ఖమ్మం అలాగే మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో ఈ నూతన విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా మొదలుపెట్టనున్నారు. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే సాధారణ రోగులకు ఈ సేవలు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయి. గతంలో టీజీఎంఎస్ఐడీసీ ద్వారా కొనుగోలు చేసిన యంత్రాలు వారంటీ గడువు ముగిశాక మరమ్మతులకు నోచుకోలేదు. హీలియం గ్యాస్, కూలింగ్ సిస్టమ్ సమస్యలతో పరీక్షలు నిలిచిపోతుండేవి. ఇప్పుడు ప్రైవేట్ సంస్థల సహకారంతో ఈ అడ్డంకులన్నీ తొలగిపోయి రోగులకు నిరంతరాయంగా సేవలు అందుతాయి.
Telangana mri services:పూర్తి నిర్వహణ ప్రైవేట్ సంస్థల చేతిలోనే
ఆసుపత్రి ప్రాంగణంలో స్థలంతో పాటు మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది. మిగిలిన కోట్ల విలువైన ఎంఆర్ఐ యంత్రాల కొనుగోలు, సిబ్బంది నియామకం వంటివన్నీ ప్రైవేట్ సంస్థలే చూసుకుంటాయి. టెక్నికల్ సమస్యలు వస్తే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కరించేలా నిబంధనలు రూపొందించారు. వైద్యులు రాసిచ్చిన స్కానింగ్‌లను ఆరోగ్యశ్రీ రేట్ల ప్రకారం రీయింబర్స్ చేసుకుంటూ పేదలకు ఉచితంగా పరీక్షలు చేస్తారు. డిజిటల్ పీఏసీఎస్ ద్వారా రిపోర్టులు నేరుగా డాక్టర్లకు ఆన్‌లైన్‌లో అందుతాయి.
Epaper: epaper.vaartha.com

