Dailyhunt
సర్వేలకు అందని ఫలితాలతో పార్టీల్లో అయోమయం

సర్వేలకు అందని ఫలితాలతో పార్టీల్లో అయోమయం

వార్త 2 days ago

Results from surveys : ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో అనూహ్యమైన, సర్వేల కందని ఫలితాలు వెలువడ్డాయి. అను భవజ్ఞులైన విశ్లేషకులు కూడా ప్రజల నాడిని కనిపెట్టలేక చతికిల బడ్డారు.

హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్లో తనదైన ముద్ర వేసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేసి, మోడీ ని సైతం ఎదురించి నిలబడగలిగిం దనే పేరు గడించిన మమతా బెనర్జీ ఈసారి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ను గెలిపించలేకపోయారు. నాలుగో పర్యాయం బెంగాల్ను అధికారంలోకి తెస్తుందని అంతా ఊహించారు. కొన్నిసర్వేలు దీదీ దే విజయమని తేల్చగా, మరికొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు ఈసారి భాజపా బెంగాల్లో పాగా వేయబోతుందని తేల్చి చెప్పాయి. ఇంకొన్ని పోస్ట్పెల్ సర్వేలు తృణమూల్ బిజెపిల మధ్య హోరాహోరీ పోటీ సాగిందని, గెలుపు ఇరుపక్షాల మధ్య దోబూచులాడుతుందని జోస్యం చెప్పాయి. ఈ ఎన్ని కల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో బిజెపి తరపున విస్తృతంగా ప్రచారం చేసిన ప్రధాన మంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షాలు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గెలవకూ డదని ఓటర్లకు బ్రెయిన్ వాష్చేసారు. ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు బిజెపి తర పున ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఎన్నికలముందు ఆరోపణలు ప్రత్యారోపణలతో రణరంగాన్ని తలపించేలా ప్రచారాస్త్రాలు సంధించిన ఇరు పక్షాలు ఎన్నికల తర్వాత కూడా తమ కార్యకర్తల మనోధైర్యం చెక్కు చెదరకుండా వ్యూహ, ప్రతివ్యూహాలను ప్రదర్శించాయి.

Read Also: Vijay Oath Taking Ceremony: సీఎంగా రేపు విజయ్ ప్రమాణస్వీకారం: నెహ్రూ స్టేడియంలో భారీ ఏర్పాట్లు

 results from surveys

results from surveys : సర్వే అంచనాలు

ప్రజాభిప్రాయం తమకే అనుకూలమని ధీమా ప్రదర్శించాయి. ఆటగాళ్లు ఎంత పోటుగాళ్లయినా ఆటలో గెలిచేది ఒకరే. మమతా బెనర్జీ 15సంవత్స రాల ఏకచ్ఛత్రాధిపత్యానికి బిజెపి గండి కొట్టి, బెంగాల్ గడ్డపై తొలిసారి కాషాయ జెండా ఎగరేసిం ది. ఈ విజయం బిజెపిని ఆనందోత్సాహంలో ముంచెత్తింది. ఇటీవల ‘సర్పై పశ్చిమ బెంగాల్లో వివాదం చెల రేగింది. 90లక్షల పైగా ఓటర్లను తొలగించడం వలన 130 నియోజకవర్గాల్లో తృణమూల్ అపజయం పాలైనదని చేస్తు న్న ఆరోపణ బిజపి భారీ విజయంలో కొట్టుకుపోయింది. తమిళనాడులో కూడా 50లక్షల ఓట్లు తొలగించారనే ఆరోప ణలున్నా, అక్కడ ఎన్డీయే విజయం సాధించలేకపోవడాన్ని గమనించాలి. అన్ని సర్వేలు డిఎంకె విజయం ఖాయమని చెప్పినా కేవలం యాక్సెస్ మై ఇండియా సర్వే మాత్రం విజయ్ సారధ్యంలోని టి.వి.కె విజయం సాధిస్తుందని చెప్పింది. ఇప్పుడు ఈ సర్వే అంచనాలు నిజమైనాయి. స్టాలిన్ ఆధ్వర్యంలోని డి.ఎం.కె ను మూడవ స్థానంలోకి నెట్టి టివికె అద్భుతమైన ఫలితాలు సాధించడం విశేషం. ఇటీవలి కాలంలో విజయ్ పై అనేక ఆరోపణలొచ్చాయి. వీటినన్నింటినీ అధిగమించి, కేవలం 20.30 స్థానాలకే టివికె పరిమితమన్న అధిక శాతం సర్వేల అంచనాలను తోసిపుచ్చి, తమిళనాట సరికొత్త రాజకీయ పరిణామాలకు విజయ్ నాంది పలికారు.

భారీ విజయం

అశేషమైన ప్రజాభిమానమున్న రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా ప్రజలను తీవ్ర నిరాశ కు గురిచేసారు. విజయకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లో రాణించలేకపోయారు. జయలలిత మరణంతో అన్నాడిఎంకె లో నిరుత్సాహం ఆవహించింది. ఆ పార్టీ బిజెపితో అల యన్స్ పెట్టుకుని ప్రతిపక్ష పాత్రకు పరిమితమైనది. ఇప్పుడు విజయ్ సారధ్యంలో టివికె అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ లా విజృంభించి, పార్టీ పెట్టిన కొద్ది కాలంలోనే తమిళనాట ఎన్నికల్లో అతి పెద్దపార్టీగా టివికెను నిలబెట్టారు. ఇక అస్సాం లో ఈసారి 85శాతం పోలింగ్ నమోదైంది. 126 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ విజ యం సాధించడం గమనార్హం. గత ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కనబరిచిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని తీవ్రంగా ప్రయత్నించినా నిరాశ మాత్రమేమిగి లింది. కేరళంలో పినరయి విజయ్ నేతృత్వంలోని ఎల్. డి.ఎఫ్ ఘోర ఓటమి పాలై, కాంగ్రెస్ నేతృత్వంలోని యు. డి.ఎఫ్ పగ్గాలు చేపడుతున్నది. కేరళంలో ఎల్డీఎఫ్ ఓటమి కమ్యూనిస్టులకు శరాఘాతంలా మారింది. ఈ ఓటమితో కమ్యూనిస్టు పార్టీలు దేశంలో ఎక్కడా ఉనికిలో లేకుండా పోవడం విచారకరం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు.

ఐక్యమత్యంగా ముందుకు సాగాలి

2029 సార్వత్రిక ఎన్నికలపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూట మి తీవ్రస్థాయిలో మేధోమధనం జరపాలి. తమకూటమిలో ని అసమ్మతిని తొలగించి, ఐక్యమత్యంగా ముందుకు సాగా లి. పుదుచ్చేరి కూడా ఎన్డీయే నిలబెట్టుకుంది. బిజెపి ప్రవచిత మెజారిటీ నినాదం ఎన్నికల్లో సత్పలితాలనివ్వడమేకాకుండా, ప్రతిపక్ష పార్టీలు కుహనా లౌకిక వాదంతో మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని చెప్పడం ద్వారా పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రంలో బిజెపి విజయం సాధించిందని విశ్లేషకుల భావన. బెంగాల్లో దీదీ బంగ్లాదేశ్ చొరబాటు దారులకు ప్రోత్సాహమిస్తున్నదని బిజెపినేతలు చేసిన ప్రచారం, మమత అతి విశ్వాసం, అర్థంలేని దూకుడు, దుందు డుకు తనం తృణమూల్ అపజయానికి కారణమనిపలువురు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీగా నమోదైన ఓట్లశాతం అక్కడి ప్రభుత్వాలపై ఏర్పడిన వ్యతిరేకత వలనే అని ఊహించలేక, తామే తిరిగి అధికారం లోకి వస్తామని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హడావిడిచేసి, భంగపడ్డారు.

 results from surveys

రాజకీయాల్లో గెలుపోటములు సహజం

ఏది ఏమైనప్పటికీ మినీ సార్వత్రిక ఎన్నికల్లా సాగిన రాజకీయ పోరు ఫలితాల ప్రకటనతో ముగిస్తుందని చెప్పలేం. సర్ వివాదం, ఇవియంల గొడవ అలాగో ఉండనే ఉంది. గెలిచిన రాజకీయ పక్షాలు విజయాన్ని తమ గొప్పగా చెప్పుకుంటుంటే, ఓడిన పక్షాలు ఏవో సాకులు చెప్పి ప్రజ లను తప్పుదారి పట్టించడం రాజకీయ ప్ర హసనంలో సర్వ సాధారణమే. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా రాజకీయ పక్షాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పార్టీల మధ్య నిరంతరం కక్షలు, కార్ప ణ్యాలు రావణకాష్టంలా రగులుతూనే ఉంటున్నాయి. ప్రజల మధ్యకూడా రాజకీయాల కారణంగా స్పష్టమైన విభజన రేఖ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులుపోవాలి. రాజకీయాల్లో క్రీడా స్పూర్తి నెలకొనాలి. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, సర్వ సాధారణం. అయితే గెలుపును ఆనందంగా ఆస్వాదిస్తు న్న రాజకీయనేతలు ఓటమినిమాత్రం స్వీకరించలేని బలహీ నత కలిగిఉండడం బాధాకరం. రాజకీయాల్లో శాశ్వతమిత్రులు, శాశ్వత శతృవులంటూ ఎవరూ ఉండరు. రాజకీయాల్లోఆత్మ హత్యలే తప్ప హత్యలుండవనే నానుడి వాస్తవం. రాజకీ యాల్లో విమర్శనాత్మక దృక్పథం ఆవశ్యకం. సద్విమర్శలు స్వీకరించని రాజకీయ పక్షాలు అంతర్థానంకాకతప్పవు.

-సుంకవల్లి సత్తిరాజు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కాంగ్రెస్ తర్వాత వీసీకే మద్దతు కోరుతున్న విజయ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha