Satheesan : దళం రాజకీయ యవనికపై ఒక నూతన శకం ఆరంభ మైంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ రాజ కీయ శైలికి భిన్నంగా, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తాను పునర్నిర్మించుకునే ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కేరళం కాంగ్రెస్ శాసనసభాపక్షతగా, తద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీడీ సతీశన్ పేరు ను అధికారికంగా ఖరారు చేయడం ద్వారా పార్టీ హైకమాండ్ ఒక సాహసోపేతమైన, స్పష్టమైన సంకేతాన్ని పంపింది.
ఇది కేవలం ఒక వ్యక్తి ఎంపిక మాత్రమే కాదు, కేరళంలో కాంగ్రెస్ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, కోల్పోయిన వైభవా న్ని తిరిగి సంపాదించుకోవడానికి చేపట్టిన ఒక బృహత్తర రాజకీయ శస్త్రచికిత్సగా విశ్లేషకులు భావిస్తున్నారు. కేరళం రాజకీయ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే, అక్కడ ప్రజలు ఐదేళ్లకోసారి అధికారాన్ని మార్చే సంప్రదాయాన్ని, అంటే పెండ్యులం పాలిటిక్ను దశాబ్దాలుగా పాటిస్తూ వచ్చారు. యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్, లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ కూటముల మధ్య అధికారం మారుతూ ఉండటం ఒక ఆన
వాయితీగా ఉండేది. అయితే, 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలి తాలు ఈ దశాబ్దాల సంప్రదాయాన్ని పూర్తిగా తుడిచి పెట్టే శాయి.
Read Also : Kerala News: రాహుల్ గాంధీపై వృద్ధురాలి మమకారం.. సతీశన్ ప్రమాణ స్వీకారంలో భావోద్వేగ దృశ్యం!
Satheesan
Satheesan : బలమైన సమీకరణాలు
పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్వరు సగా రెండోసారి అధికారంలోకి వచ్చి సరికొత్త చరిత్ర సృష్టిం చింది. 140 స్థానాలున్న అసెంబ్లీలో ఎల్డీఎఫ్ 99 స్థానాల ను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ నేతృత్వంలోనియూడీఎఫ్ కేవలం 41స్థానాలకే పరిమితమైంది. ఈ ఘోర పరాజయం కాంగ్రెస్ శిబిరంలో ఆత్మరక్షణ ధోరణిని పెంచడమేకాకుండా, నాయకత్వ మార్పు అనివార్యమనే సత్యాన్ని గట్టిగా నొక్కి చెప్పింది. అప్పటి వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న కొందరు సీనియర్ల వ్యూహాలు వామపక్షాల క్యాడర్ బలాన్ని, పినరయి విజయన్ ప్రజాకర్షణను అడ్డుకోలేకపోయాయి. ఈ నేపథ్యం లోనే యువతకు, దూకుడు ఉన్న నాయకత్వానికి పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ పార్టీ అంతర్గత వేదికలపై బలంగా వినిపించింది. వీడీ సతీశన్ఎంపిక వెనుక అనేక బలమైన సమీకరణాలు ఉన్నాయి. ఎర్నాకుళం జిల్లాలోని పరవూర్ నియోజకవర్గం నుంచి 2001 నుంచి వరుసగా ఐదుసార్లు గెలుస్తూ వస్తున్న సతీశన్,అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయన కేవ లం ఒక రాజకీయ నాయకుడే కాదు, లోతైన అధ్యయనశీలి అద్భుతమైన వక్త. అసెంబ్లీలోఆయన చేసే ప్రసంగాలు గణాంకాలతో, తార్కికతతో కూడి ఉంటాయి. ముఖ్యంగా పినరయి విజయన్ ప్రభుత్వంపై ఆయన సంధించే అస్త్రాలు అధికార పక్షాన్ని ఎప్పుడూ ఆత్మరక్షణలో పడేస్తుంటాయి.
ప్రత్యామ్నాయ విధానాలను
గత కొన్నేళ్లుగా కేరళను కుదిపేసిన గోల్డ్స్మగ్లింగ్ కేసు, లైఫ్మిషన్ స్కామ్, వివాదాస్పద ఏఐ కెమెరాల కొనుగోలు వ్యవహారం, మద్యం విధానంలో మార్పులు వంటి అంశాలను సతీశన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. కేవలం విమర్శలకే పరిమి తం కాకుండా, ప్రత్యామ్నాయ విధానాలను సూచించగల మేధోసంపత్తి ఉండటం ఆయనకు ప్రధాన బలంగా మారిం ది. రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజలు, విద్యావంతులు యువత సతీశన్ శైలిని ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఏఐ సీసీ అంతర్గత సర్వేల్లో తేలడంతో అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపింది. అయితే, ఈఎంపిక ప్రక్రియ అంత సుల భంగా ఏమీ సాగలేదు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా పాతుకుపోయిన వర్గపోరు ముఖ్యంగా ఉమెన్ చాందీ వర్గం రమేశ్ చెన్నితాల వర్గాల మధ్య పోరు సతీశన్ అభ్యర్థిత్వా నికి ఆదిలో అడ్డంకిగా నిలిచింది. సీనియర్ నాయకుడు రమేశ్ చెన్నితాల తనకున్న దశాబ్దాల అనుభవాన్ని, పార్టీపై ఉన్నపట్టును నమ్ముకున్నారు. మరోవైపు, జాతీయ స్థాయి లో చక్రంతిప్పుతున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయగల సమర్థుడిగా వేణుగోపాలు గుర్తింపు ఉన్నప్పటికీ, ఆయన సేవలు జాతీయ రాజకీయాల్లోనే అత్యవసరమని అధిష్టానం భావించింది.
సరికొత్త వ్యూహానికి బలమైన నిదర్శనం
చెన్నితాల నాయకత్వంలో వరుస వైఫల్యాలు ఎదురైన నేపథ్యంలో, మార్పు కోరుకునే మెజా రిటీ ఎమ్మెల్యేలు సతీశన్ వైపు నిలబడటంతో అధిష్టానం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు సతీశన్కే జై కొట్టడం ద్వారా కేరళలో పాత తరంరాజకీయాలకు తెరదించినట్లైంది. ఈ నిర్ణయం కేవలం కేరళంకు మాత్రమే పరిమితమైనది కాదు, దేశవ్యా ప్తంగా కాంగ్రెస్ అనుసరిస్తున్న సరికొత్త వ్యూహానికి ఇది ఒక బలమైన నిదర్శనం. గతంలో కర్ణాటకలో డీకే శివకుమార్ ను, తెలంగాణలో రేవంత్ రెడ్డిని ముందంజలో ఉంచి, తద నంతరం అధికారం దిశగా నడిపించిన కాంగ్రెస్, ఇప్పుడు అదే ‘అగ్రెసివ్’ ఫార్ములాను కేరళంలో అమలు చేస్తోంది. ముసలి నాయకత్వంతో కాకుండా, చురుకైన, కాలంతో పోటీ పడే నాయకులను ప్రోత్సహించడం ద్వారా బిజెపి, ప్రాంతీయ . పార్టీల దూకుడును అడ్డుకోవాలని కాంగ్రెస్ కృత నిశ్చయంతో ఉంది. సతీశన్ ఎంపిక ద్వారా గ్రూపు రాజకీ యాలకు అతీతంగా ‘మెంటు ప్రాధాన్యం ఇస్తామనే సంకే తాన్నిపార్టీ కేడర్కు పంపింది. ఇది సామాన్య కార్యకర్తల్లో మునుపెన్నడూ లేని కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం కేరళంలో రాజకీయచిత్రం అత్యంత సంక్లిష్టంగా ఉంది. ఒక వైపు వామపక్షాలు తమ సోషల్ ఇంజనీరింగ్తో అన్ని వర్గా లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పినరయి విజయన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో
బలంగా ఉండగా, మరోవైపు, బిజెపి కేరళంలో గట్టి పునాది వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
Satheesan
మతాతీత రాజకీయాల
త్రిస్సూర్ లోక్సభ స్థానాన్ని గెలు చుకోవడం ద్వారా తమకు భవిష్యత్తు ఉందనే నమ్మకాన్ని బిజెపి కల్పించుకుంది. మైనారిటీ ఓట్లు చేజారకుండా చూసు కుంటూనే, హిందూ ఓటు బ్యాంకును కాపాడుకోవడంఆయ నకు కత్తి మీద సాము వంటిదే. సామాజిక మాధ్యమాల్లో వామపక్షాల సైబర్ వింగ్ను ఢీకొట్టడం, ప్రతి గ్రామంలో పార్టీక్యాడర్ను ఉత్తేజితం చేయడం వంటి బాధ్యతలు ఆయ నపై ఉన్నాయి. సతీశన్ రాజకీయ ప్రస్థానంలో మరొక విశే షం ఆయన లౌకికవాద దృక్పథం. కేరళంలో మతపరమైన సమీకరణాలు చాలా బలంగా ఉంటాయి. కానీ ఆయన ఎప్పు డూ మతాతీత రాజకీయాలకే మొగ్గు చూపుతారు. గతంలో వరదలు వచ్చినప్పుడు లేదా కోవిడ్ సంక్షోభ సమయంలో ఆయన చేసిన సేవాకార్యక్రమాలు ఆయనకు రాజకీయాలకు అతీతంగా మద్దతును సం పాదించిపెట్టాయి. పినరైవిజయన్ వంటి ఉద్ధండుడైన నేతను ఎదుర్కోవాలంటే కేవలం రాజ కీయ విమర్శలు మాత్రమేకాక, ప్రజలకు ఒక బలమైనభరోసా కల్పించడంలో కాంగ్రెస్పార్టీని ముందు వరుసలో ఉంచగలి గారు. ఆభరోసాను కల్పించడంలో సతీశన్ సఫలమ వుతు న్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-రామ కిష్టయ్య సంగన భట్ల
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

