Nirmal Crime: తెలంగాణలో ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లాలో వెలుగుచూసిన సవతితల్లి ఘాతకం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికర వాతావరణాన్ని సృష్టించింది.
సవతి కొడుకుతో పెట్టుకున్న అక్రమ సంబంధం బయటపడటంతో పాటు, అతడు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకోవడాన్ని జీర్ణించుకోలేక ఓ సవతితల్లి సుపారీ గ్యాంగ్ (Supari Gang) ద్వారా అతడిని దారుణంగా హత్య చేయించింది. ఈ దారుణ హత్య కేసుకు సంబంధించిన వివరాలను నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలా (Janaki Sharmila) వెల్లడించారు.
Read Also:ANM Suicide Nellore: నెల్లూరు జిల్లాలో ANM ఆత్మహత్య
బాబాయికి విషయం చెప్పడంతో మొదలైన కక్ష

నిర్మల్ పట్టణానికి చెందిన ఆటోడ్రైవర్ అస్లాం ఖాన్ తండ్రి 17 ఏళ్ల క్రితం అన్వరీ బేగంను రెండో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా సవతితల్లి అన్వరీ బేగంతో ఉన్న అక్రమ సంబంధానికి స్వస్తి చెప్పి, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని అస్లాం నిర్ణయించుకున్నాడు.పెళ్లి చేసుకోవద్దని, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని అన్వరీ ఒత్తిడి తెచ్చినప్పటికీ అస్లాం వినలేదు. ఈ ఒత్తిడి తట్టుకోలేక అస్లాం తన బాబాయికి విషయం చెప్పడంతో కుటుంబంలో, బంధువుల్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. దీంతో అస్లాం వైఎస్సార్ కాలనీలోని బాబాయి ఇంటికి మారి ఆటో నడుపుకుంటున్నాడు.
రూ. 6 లక్షలకు సుపారీ – మహారాష్ట్ర గ్యాంగ్ రంగంలోకి
అందరి ముందు తన పరువు తీశాడనే కక్షతో అన్వరీ బేగం మహారాష్ట్రకు చెందిన సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించింది. హత్య చేయడానికి రూ. 6 లక్షల సుపారీ మాట్లాడుకుని, రూ. 50,000 అడ్వాన్స్‌గా ఇచ్చింది. ఈ కుట్రలో అన్వరీ తన సొంత తమ్ముడు షేక్ మహమ్మద్‌ను భాగస్వామిని చేసింది. అస్లాం ఫోటో, ఆటో నంబర్ మరియు కదలికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సుపారీ గ్యాంగ్‌కు అందించారు.
జూలై 15న పక్కా ప్లాన్‌తో దాడి – చికిత్స పొందుతూ మృతి
జూలై 15న వైఎస్సార్ కాలనీ వద్ద అస్లాం ప్రయాణికులతో ఆటోలో వస్తుండగా, కారులో వచ్చిన సుపారీ గ్యాంగ్ ఆటోను అడ్డుకుంది. అస్లామ్‌ను బయటకు లాగి కత్తులతో దారుణంగా పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అస్లామ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
Nirmal Crime: ఎస్పీ పర్యవేక్షణలో 4 ప్రత్యేక బృందాలు – నిందితుల అరెస్ట్
హత్య ఘటనపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షణలో 4 ప్రత్యేక బృందాలు (4 Special Teams) రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి. ప్రధాన కుట్రదారుగా అన్వరీ బేగంను గుర్తించిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించి సుపారీ గ్యాంగ్ మరియు సహకరించిన తమ్ముడి వివరాలను బయటపెట్టింది. నిందితులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
Epaper: epaper.vaartha.com
తల్లికి వందనం డబ్బులివ్వనన్న భార్య.. గొంతుకోసి హత్య చేసిన భర్త

