Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
SBI సేవలకు అంతరాయం

SBI సేవలకు అంతరాయం

వార్త 2 weeks ago

SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిజిటల్ సేవల్లో సాంకేతిక లోపం తలెత్తింది. టెక్నికల్ సమస్యల కారణంగా యోనో (YONO) యాప్, యూపీఐ (UPI) మరియు ఐఎంపీఎస్ (IMPS) వంటి ప్రధాన ఆన్‌లైన్ లావాదేవీల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు బ్యాంక్ యాజమాన్యం వెల్లడించింది.

దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎస్బీఐ ఖాతాదారులు అత్యవసర నగదు బదిలీలు మరియు ఆన్‌లైన్ చెల్లింపులు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయమై స్పందించిన ఎస్బీఐ, సాంకేతిక బృందం సమస్యను పరిష్కరించేందుకు శ్రమిస్తోందని అధికారికంగా ప్రకటించింది.

 SBI Staff Strike

మధ్యాహ్నానికి సేవలు యథాతథం: ప్రత్యామ్నాయ మార్గాలను సూచించిన బ్యాంక్

ఈ సాంకేతిక సమస్య ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల కల్లా పూర్తిగా తొలగిపోతుందని, ఆ తర్వాత డిజిటల్ సేవలన్నీ యథాతథంగా పునరుద్ధరించబడతాయని ఎస్బీఐ తమ అధికారిక సామాజిక మాధ్యమ (X) ఖాతా ద్వారా వెల్లడించింది. సర్వర్ పునరుద్ధరణ పూర్తయ్యేంత వరకు వినియోగదారులు ప్రత్యామ్నాయంగా ఎస్బీఐ యూపీఐ లైట్ (UPI Lite) మరియు ఏటీఎమ్ (ATM) సేవల ద్వారా తమ అత్యవసర నగదు లావాదేవీలను పూర్తి చేసుకోవాలని బ్యాంక్ అధికారులు వినియోగదారులకు సూచించారు.

పుంజుకున్న 4G సేల్స్..కారణం అదే !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha