Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెక్యూరిటీ గార్డు పైశచికం.. ముగజీవం పై లైంగిక దాడి ఆరోపణలు

సెక్యూరిటీ గార్డు పైశచికం.. ముగజీవం పై లైంగిక దాడి ఆరోపణలు

వార్త 7 hrs ago

Kompally Crime: హైదరాబాద్‌ శివారులోని కొంపల్లిలో ఓ ఆడ కుక్కపై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా సాయినగర్‌లోని మెఫెయిర్‌ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సంజయ్‌ తివారీ (50)పై ఆరోపణలు రావడంతో స్ట్రే యానిమల్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read Also :Man Dragged On Car Roof : కాన్పూర్‌లో ఘోరం: వ్యక్తి చేతులు విండోలో ఇరికించి, కారు రూఫ్‌పై ఈడ్చుకెళ్లి హత్య

శాలువలో కుక్కను తీసుకెళ్లినట్లు ఆరోపణలు

అందిన సమాచారం ప్రకారం.. ఈ నెల 8న అపార్ట్‌మెంట్‌ ఆవరణలో తిరుగుతున్న ఓ ఆడ కుక్కను సెక్యూరిటీ గార్డు శాలువలో బంధించి తన క్యాబిన్‌లోకి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ కుక్కపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం సేకరించిన స్ట్రే యానిమల్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం.

జంతు సంరక్షణపై ఆందోళన

ఈ ఘటనపై జంతు సంరక్షణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధను మాటల్లో చెప్పుకోలేని మూగజీవాల పట్ల క్రూరత్వానికి పాల్పడటం ఆందోళనకరమని పేర్కొంటున్నారు. అపార్ట్‌మెంట్లు, నివాస ప్రాంతాల్లో తిరిగే వీధి కుక్కల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Kompally Crime: పోలీసుల విచారణపై ఎదురుచూపులు

ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందినట్లు సమాచారం ఉన్నప్పటికీ, ఆరోపణలు నిర్ధారణ కావాల్సి ఉంది. పోలీసుల విచారణలో వాస్తవాలు వెల్లడికావాల్సి ఉండగా, నిందితుడిపై తీసుకున్న చర్యలు, కుక్క ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భారత్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్స్ హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్‌పురియా అమెరికాలో అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha