Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెల్ఫీ వివాదంపై స్పందించిన పూజా హెగ్డే

సెల్ఫీ వివాదంపై స్పందించిన పూజా హెగ్డే

వార్త 3 weeks ago

Pooja Hegde Selfie Controversy: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన తాజా హిందీ చిత్రం 'హై జవానీతో ఇష్క్ హోనా హై' జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

డ్యాన్సింగ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాపై బాలీవుడ్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే, సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న తరుణంలో పూజా హెగ్డే అనుకోకుండా ఒక సోషల్ మీడియా వివాదంలో చిక్కుకుంది.

ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌లో పూజా హెగ్డే నడుచుకుంటూ వెళ్తుండగా.. ఒక అభిమాని ఆమెతో సెల్ఫీ దిగడానికి ఎంతో ఆసక్తిగా ప్రయత్నించాడు. అయితే, పూజా అతడిని అస్సలు పట్టించుకోకుండా, కనీసం చూడకుండా ముందుకు వెళ్ళిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “పూజా హెగ్డేకు అంత పొగరా?” అంటూ సోషల్ మీడియా వేదికగా నెగెటివ్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు.

Read Also: Nandamuri Tejaswini: డ్యాన్స్‌తో షాకిచ్చిన బాలయ్య చిన్న కూతురు

 Pooja Hegde responds to selfie controversy

Pooja Hegde Selfie Controversy: నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు: పూజా హెగ్డే

ఈ సెల్ఫీ వివాదం పెద్దదై సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, పూజా హెగ్డే తక్షణమే స్పందించి అసలు విషయంపై స్పష్టతనిచ్చింది. “సినిమా వాళ్లకు జీవితాన్ని, గుర్తింపును ఇచ్చేది ఎప్పుడూ ప్రేక్షకులే. కొన్నిసార్లు ఈవెంట్లలో ఉండే హడావిడి పరిస్థితులు, సెక్యూరిటీ ఒత్తిడి వల్ల చుట్టుపక్కల ఉన్న అభిమానులను సరిగ్గా గమనించలేకపోవచ్చు. అంతేకానీ మాకు పొగరు ఉండి అలా చేశామని కాదు. మాకు ఎప్పుడూ అభిమానులే దేవుళ్లు. దయచేసి నన్ను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు” అని పూజా హెగ్డే వివరణ ఇచ్చింది.

సాధారణంగా సెలబ్రిటీలు ఎయిర్‌పోర్టుల్లో లేదా ఈవెంట్లలో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే పూజా హెగ్డే ఏమాత్రం ఇగోకు పోకుండా, చాలా సున్నితంగా స్పందిస్తూ అభిమానులకు క్షమాపణలు చెప్పే ధోరణిలో మాట్లాడటంతో ఈ వివాదానికి దాదాపు తెరపడినట్లేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

దాసరి సమాధి నిర్లక్ష్యంపై స్పందించిన మంచు మనోజ్, గీతా ఆర్ట్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha