Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళా క్రికెట్ జట్టు తమ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. తాజాగా జపాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.
బౌలింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత జట్టు 8 వికెట్ల తేడాతో జపాన్‌ను మట్టికరిపించి, అధికారికంగా సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది.
Read Also : IND Vs Afg : చరిత్ర సృష్టించిన భారత్
Indian women’s cricket team storms into the semi-finals.
Asian Games 2026: శ్రీ చరణి అద్భుత బౌలింగ్ స్పల్
టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌కు బౌలర్లు డ్రీమ్ స్టార్ట్ ఇచ్చారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి తన కేరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి జపాన్ బ్యాటింగ్ ఆర్డర్ నడుం విరిచింది. మరోవైపు పార్ట్-టైమ్ స్పిన్నర్ షెఫాలి వర్మ 13 పరుగులకు 2 వికెట్లు తీసి శ్రీ చరణికి చక్కటి సహకారం అందించింది. దీంతో జపాన్ ఇన్నింగ్స్ మొత్తం మీద కేవలం మూడు బౌండరీలు మాత్రమే నమోదు చేసి, 57 పరుగులకే కుప్పకూలింది.
షెఫాలి వర్మ మెరుపు ఇన్నింగ్స్.. 30 బంతుల్లోనే లక్ష్య ఛేదన
కేవలం 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఏమాత్రం తడబడలేదు. ఓపెనర్ షెఫాలి వర్మ మొదటి బంతి నుంచే జపాన్ బౌలర్లపై విరుచుకుపడింది. కేవలం 15 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 40 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమెకు తోడుగా రిచా ఘోష్ 6 బంతుల్లో 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో, టీమిండియా కేవలం 5 ఓవర్లలోనే (30 బంతుల్లో) లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది.

