Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షాబాద్‌లో ఆరుగురి దారుణ హత్యలు

షాబాద్‌లో ఆరుగురి దారుణ హత్యలు

వార్త 0 months ago

Shabad Murder Case:షాబాద్‌లో ఆరుగురి దారుణ హత్యలు. రంగారెడ్డి జిల్లాలో సంచలనం. భార్య, ఇద్దరు పిల్లలు సహా ఆరుగురిని హతమార్చిన నిందితుడు పరారీ..

పోలీసుల ముమ్మర గాలింపు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో శనివారం చోటుచేసుకున్న ఆరుగురు హత్యల ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఒకేరోజు ఆరుగురు దారుణంగా హత్యకు గురికావడంతో జిల్లా వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. భార్య, ఇద్దరు చిన్నారులతో పాటు మరో కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజు కుమార్ (28) పరారీలో ఉండగా, అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడు తన భార్య పార్వతి సరిత (30), కుమారులు పరీక్షిత్ (3), దైవిక్షిత్ (2)లను హత్య చేశాడు. అనంతరం చిట్యాల రుక్కమ్మ (65), ఆమె కుమార్తె చిట్యాల లక్ష్మీ (45), మైనర్ బాలిక (17)లను కూడా అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం నిందితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి,నేనే ఆరుగురిని చంపాను.. ఒకచోట ముగ్గురిని, మరోచోట ముగ్గురిని హత్య చేశాను.

Read also: USA Road Accident: అమెరికాలో ఏపీ యువతి మృతిపై పలు అనుమానాలు.. యాక్సిడెంటేనా, మర్డరా?

 Brutal murder of six people in Shabad

Shabad Murder Case:భయానక ఘటన వెనుక అసలు కథ

నేను కూడా చనిపోతున్నాను అని చెప్పినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అయితే అప్పటికే నిందితుడు పరారైనట్లు తెలుస్తోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతదేహాలు రెండు వేర్వేరు ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. సంఘటనకు గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబ కలహాలా, పాత కక్షలా లేదా మరేదైనా కారణమా అనే అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.నిందితుడిపై గతంలో పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు కూడా సమాచారం వెలువడుతోంది. అయితే దీనిపై పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

జైపూర్‌లో దారుణం: కారుతో తొక్కించి తల్లిని చంపిన కూతురు.. ఏడాది క్రితం తండ్రిని కూడా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha