Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శాంసంగ్ సంచలనం: 70 వేల కోట్ల వారసత్వ పన్ను చెల్లింపు పూర్తి

శాంసంగ్ సంచలనం: 70 వేల కోట్ల వారసత్వ పన్ను చెల్లింపు పూర్తి

వార్త 1 month ago

Samsung Inheritance Tax: దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ గ్రూప్ వారసులు అసాధ్యమైన మైలురాయిని చేరుకున్నారు. మాజీ చైర్మన్ దివంగత లీ కున్-హీ వదిలి వెళ్ళిన ఆస్తులకు సంబంధించి సుమారు 12 ట్రిలియన్ వోన్ల (8 బిలియన్ డాలర్లు) వారసత్వ పన్నును ఐదేళ్ల పాటు ఆరు విడతల్లో చెల్లించి, ఆదివారంతో ఆ ప్రక్రియను పూర్తి చేశారు.

Read Also:Iran-America War: యుద్ధంతో ప్రశ్నార్థకంగా మారిన ట్రంప్ మామ భవిష్యత్తు

Samsung Inheritance Tax: ఎందుకింత పన్ను?

దక్షిణ కొరియాలో వారసత్వ పన్ను రేట్లు ప్రపంచంలోనే అత్యధికంగా (సుమారు 50%) ఉంటాయి. లీ కున్-హీ, సుమారు 26 ట్రిలియన్ వోన్ల విలువైన షేర్లు, రియల్ ఎస్టేట్, అరుదైన కళాఖండాలను వారసులకు వదిలి వెళ్లారు. వీటిని పొందేందుకు ప్రస్తుత చైర్మన్ లీ జే-యోంగ్, ఆయన కుటుంబ సభ్యులు ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చింది.

 Samsung family pays 12 trillion won inheritance tax Lee Kun-hee

దేశ ఆదాయం కంటే ఎక్కువే

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 2024 సంవత్సరానికి దక్షిణ కొరియా ప్రభుత్వం అంచనా వేసిన మొత్తం వారసత్వ పన్ను ఆదాయం కంటే శాంసంగ్ కుటుంబం ఒక్కటే చెల్లించిన మొత్తం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంది. ఎలక్ట్రానిక్స్ నుంచి షిప్ బిల్డింగ్ వరకు విస్తరించిన శాంసంగ్ సామ్రాజ్యం ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంత కీలకమో ఈ పన్ను చెల్లింపు మరోసారి నిరూపించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఖలిస్తాన్ తీవ్రవాదులను 'జాతీయ భద్రతా ముప్పు'గా ప్రకటించిన కెనడా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha