పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
ఈ పరిణామం అటు అమెరికా-ఇరాన్ మధ్య జరగబోయే రెండో విడత శాంతి చర్చలకు మార్గం సుగమం చేసేలా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని “చరిత్రాత్మక రోజు”గా అభివర్ణించారు. ముఖ్యంగా లెబనాన్ ప్రజలకు ఇది గొప్ప ఊరటనిచ్చే విషయమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గ్రూపు గనుక నిబంధనలకు కట్టుబడి ఉంటే, అది ఆ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు ఒక సువర్ణావకాశం అవుతుందని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు.
Israel-Lebanon War
Israel-Lebanon War: రాజకీయ దుమారం: ట్రంప్ లొంగిపోయారా?
ఈ ఒప్పందం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, లెబనాన్ పార్లమెంట్ సభ్యులు కొందరు దీనిని భిన్నంగా విశ్లేషిస్తున్నారు. ఇరాన్ నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి వల్లే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని, వాస్తవానికి ట్రంప్ ఇరాన్ వ్యూహాలకు లొంగిపోయారని వారు ఆరోపిస్తున్నారు. ఈ బాహ్య ఒత్తిడి కారణంగానే ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గి కాల్పుల విరమణకు అంగీకరించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్-లెబనాన్ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, ఇప్పుడు అందరి దృష్టి అమెరికా-ఇరాన్ మధ్య జరగబోయే రెండో విడత శాంతి చర్చలపై పడింది. మొదటి విడత చర్చలు అంతగా ఫలించకపోయినా, ఈ తాజా పరిణామాలు రెండు దేశాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తాయని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనాలంటే ఈ చర్చలు అత్యంత కీలకం కానున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

