Dailyhunt
'శాంతి ప్రణాళిక' సమర్పించిన ఇరాన్.. ట్రంప్ రియాక్షన్ ఏంటి?

'శాంతి ప్రణాళిక' సమర్పించిన ఇరాన్.. ట్రంప్ రియాక్షన్ ఏంటి?

వార్త 6 days ago

Trump: మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణానికి ముగింపు పలికే దిశగా ఇరాన్ కీలక అడుగు వేసింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ద్వారా అమెరికాకు 14 అంశాలతో కూడిన సమగ్ర శాంతి ప్రణాళికను ఇరాన్ సమర్పించింది.

ఇరాన్ ప్రతిపాదనలో ముఖ్య అంశాలు:

తస్నిమ్ వార్తా సంస్థ కథనం ప్రకారం, ఇరాన్ తన ప్లాన్‌లో పలు కీలక డిమాండ్లను ఉంచింది:

  • శాశ్వత కాల్పుల విరమణ: తాత్కాలిక విరామం కాకుండా, కేవలం 30 రోజుల్లోనే శాశ్వతంగా యుద్ధానికి ముగింపు పలకాలని ఇరాన్ కోరింది.
  • సైనిక ఉపసంహరణ: ఇరాన్ పరిసర ప్రాంతాల నుండి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో తమపై ఎలాంటి దాడులు జరగవని భద్రతా హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది.
  • ఆర్థిక ఆంక్షల ఎత్తివేత: ఇరాన్‌పై ఉన్న అన్ని అంతర్జాతీయ ఆంక్షలను పూర్తిగా తొలగించడంతో పాటు, విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని కోరింది.
  • హోర్ముజ్ జలసంధి: అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి భద్రత కోసం కొత్త నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.

బంతి ఇప్పుడు అమెరికా కోర్టులోనే: కాజెం ఘరీబాబాదీ

“శాశ్వత శాంతి కోసం మేము మా ప్రణాళికను పాకిస్థాన్ ద్వారా అమెరికాకు పంపాము. ఇప్పుడు దౌత్యం వైపు వెళ్తారో లేక ఘర్షణను కొనసాగిస్తారో తేల్చుకోవాల్సింది అమెరికానే” అని ఇరాన్ విదేశీ వ్యవహారాల ఉప మంత్రి కాజెం ఘరీబాబాదీ స్పష్టం చేశారు. అయితే, అమెరికా చిత్తశుద్ధిపై తమకు పూర్తి నమ్మకం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Trump: సంతృప్తికరంగా లేదు: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ పంపిన ఈ 14 అంశాల ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెదవి విరిచారు. వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. “వారు ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నారు, కానీ అది నాకు సంతృప్తికరంగా లేదు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనితో ఈ శాంతి ప్రయత్నాలు ఏ తీరానికి చేరుతాయనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha