Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శబరిమలలో ఇకపై రోజుకు 5 పడి పూజలు

శబరిమలలో ఇకపై రోజుకు 5 పడి పూజలు

వార్త 1 week ago

SabarimalaTemple: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు సంబంధించిన పడి పూజల నిర్వహణపై ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై శబరిమలలో రోజుకు ఐదు పడి పూజలు నిర్వహించనున్నట్లు కేరళ హైకోర్టుకు బోర్డు వెల్లడించింది.

ఇప్పటికే బుక్ చేసుకున్న పడి పూజలు పూర్తయిన తర్వాతే కొత్త బుకింగ్‌లను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం 2040 సంవత్సరం వరకు పడి పూజ కోసం 705 మంది భక్తులు బుకింగ్ చేసుకున్నట్లు దేవస్వం బోర్డు తెలిపింది. ఒక్కో పడి పూజకు రుసుము రూ.1,37,900గా ఉంది. అయితే మండల-మకరవిళక్కు సీజన్‌లో మాత్రం పడి పూజలు నిర్వహించరు.

Read Also:Polala Amavasya: సంతాన ప్రాప్తి కోసం ఈరోజు ఇలా చేయండి!

పడి పూజ బుకింగ్‌లపై డిజిటలైజేషన్

ఇప్పటికే పడి పూజకు బుక్ చేసుకున్న భక్తుల పేర్లను డిజిటల్ రూపంలోకి మార్చనున్నట్లు బోర్డు వెల్లడించింది. బుకింగ్ జాబితాలో మరణించిన వ్యక్తుల పేర్లు ఉంటే వాటిని గుర్తించి తొలగించనున్నట్లు తెలిపింది. ఈ అంశంపై జస్టిస్ బి. రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి. జయకుమార్‌లతో కూడిన దేవస్వం ధర్మాసనం విచారణ చేపట్టింది.

చిన్న దుకాణం తొలగింపునకు హైకోర్టు ఆదేశం

శబరిమలలోని కొప్రక్కలం ప్రాంతానికి సమీపంలో ఉన్న చిన్న దుకాణాన్ని వెంటనే తొలగించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. అలాగే చాలకాయం-పంబ రహదారి పునరుద్ధరణ పనుల కోసం రూ.15 కోట్లు కేటాయించినట్లు దేవస్వం బోర్డు కోర్టుకు వివరించింది. మరోవైపు శబరిమలలో అన్నదాన మండపం నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా ఎందుకు ప్రారంభించలేదో వివరణ ఇవ్వాలని కోర్టు దేవస్వం బోర్డును ఆదేశించినట్లు సమాచారం.

SabarimalaTemple: అరవణ ప్రసాదం తయారీ సామర్థ్యం పెంపు

శబరిమలలో భక్తులకు అత్యంత ప్రసిద్ధమైన అరవణ ప్రసాదం తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రోజుకు సుమారు 2 లక్షల నుంచి 2.25 లక్షల వరకు అరవణ కంటైనర్లను తయారు చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో డిమాండ్‌ను అందుకునేలా ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆరు కొత్త అరవణ తయారీ యూనిట్లు, రెండు కూలింగ్ ఛాంబర్లు, ఒక బాయిలర్ ఏర్పాటు చేయనున్నారు.ప్రస్తుతం శబరిమల అరవణ ప్లాంట్‌లో 26 తయారీ యూనిట్లు, ఆరు కూలింగ్ ఛాంబర్లు, ఆరు బాయిలర్లు పనిచేస్తున్నాయి. కొత్త యూనిట్లు అందుబాటులోకి వస్తే రోజువారీ అరవణ ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగనుంది.

Epaper: epaper.vaartha.com

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha