Dailyhunt
Shamirpet: మాజీ సిఎం స్వర్గీయ రోశయ్య సతీమణి శివలక్ష్మి కన్నుమూత

Shamirpet: మాజీ సిఎం స్వర్గీయ రోశయ్య సతీమణి శివలక్ష్మి కన్నుమూత

వార్త 2 months ago

Shamirpet: ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి(86) కన్నుముశారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో నగరంలోని వారి నివాసంలో శివలక్ష్మి తుదిశ్వాస విడిచినట్లు సంబంధితులు పేర్కొన్నారు.

వయోధిక భారంతోపాటు, కొన్నాళ్ల నుంచి అనారోగ్యంతో ఉంటూ ఆమె నివాసంలో తుది శ్వాస విడిచినట్లు తెలిపారు.

Read also: Oslo: నోబెల్‌ మరొకరికి అంకితం చేయడం కుదరదు: కమిటీ

నగరంలోని ఆమె నివాసం నుంచి సోమవారం మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం దేవరయాంజాల్ లోని వారి వ్యవసాయ క్షేత్రంకు ఆమె పార్థీవదేహాన్ని తీసుకవచ్చి సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు(Shivlakshmi Death) నిర్వహించారు. ఈ దహన సంస్కారాలను ఆమె కుమా రులు కొణిజేటి శివ సుబ్బారావు, కొనిజేటి కృష్ణప్రసాద్, కొణిజేటి మూర్తిలు నిర్వహించారు. శివలక్ష్మి మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, సామాజిక ప్రముఖులు వారి నివాసంకు చేరుకుని పార్థీవదేహానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగ దేవరయాంజాల్లో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు కె.వి.పి. రాంచందర్రావు, బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కొంపల్లి మోహన్రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్రెడ్డి, జిల్లా ఆర్టీఎ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు కత్తి రమేశ్, పలువురు పాల్గొని పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. పలువురు శివలక్ష్మి సేవాభావాన్ని, ఆమె జీవన శైలిని పలువురు గుర్తు చేసుకున్నారు. ఆమె మృతిపట్ల ప్రగాఢ సంతాపంను, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు పలువురు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆమె ప్రజాజీవితానికి దూరంగా ఉంటూనే, తన భర్త కొణిజేటి రోశయ్య రాజకీయ జీవితంలో వెన్నుదన్నుగా నిలిచారని పలువురు స్మరించుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

CM Revanth Reddy: చలాన్ పడగానే డబ్బు కట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha