Shamshabad Bullet Train:హైదరాబాద్‌ను భవిష్యత్ హైస్పీడ్ రైలు (బుల్లెట్ ట్రైన్) నెట్‌వర్క్‌లో దేశంలోనే అత్యంత కీలకమైన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
దీని కోసం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపంలోని బహదూర్‌గూడ వద్ద భారీ ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ హబ్ (బుల్లెట్ ట్రైన్ హబ్) ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. హబ్ నిర్మాణం కోసం మొత్తం 796.28 ఎకరాల భూమిని సేకరించేందుకు రంగారెడ్డి జిల్లా అధికారులు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. రైలు, విమాన, మరియు రోడ్డు రవాణా వ్యవస్థలను ఒకే చోట అనుసంధానించే (మల్టీమోడల్ కనెక్టివిటీ) వ్యూహాత్మక కేంద్రంగా దీనిని అభివృద్ధి చేయనున్నారు.
Read Also :HYDRAA: హైదరాబాద్ హాస్టళ్లపై హైడ్రా కొరడా..యాజమాన్యాలకు 3 నెలల డెడ్‌లైన్

Shamshabad Bullet Train: మూడు ప్రధాన కారిడార్లకు జంక్షన్.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో తుది రూపు
- మూడు ప్రధాన బుల్లెట్ ట్రైన్ కారిడార్లు: భవిష్యత్తులో నడవనున్న హైదరాబాద్-ముంబయి, హైదరాబాద్-బెంగళూరు, మరియు హైదరాబాద్-చెన్నై (వయా అమరావతి) హైస్పీడ్ రైలు మార్గాలకు బహదూర్‌గూడ హబ్ ప్రధాన జంక్షన్ మరియు నిర్వహణ (Operational & Maintenance) కేంద్రంగా పనిచేయనుంది.
- సిఎమ్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం: బుల్లెట్ ట్రైన్ హబ్ విమానాశ్రయానికి చేరువలోనే ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో శంషాబాద్-తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సర్వీస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న బహదూర్‌గూడను అధికారులు ఖరారు చేశారు.
- భూసేకరణ వివరాలు: బహదూర్‌గూడలోని సర్వే నంబర్లు 62, 28లలో ఏకంగా 750 ఎకరాల ప్రభుత్వ భూమి ఒకే చోట అందుబాటులో ఉంది. దీనికి అదనంగా మరో 46.28 ఎకరాల పట్టా భూమిని సేకరించడం ద్వారా మొత్తం 796.28 ఎకరాలలో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు.
- ప్రయాణికులకు బిగ్ అడ్వాంటేజ్: ఓఆర్‌ఆర్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రెండింటికీ అనుసంధానంగా ఉండటం వల్ల విమాన ప్రయాణికులు నేరుగా బుల్లెట్ ట్రైన్ సేవలను, అలాగే రోడ్డు రవాణాను సులభంగా పొందే వీలు కలుగుతుంది.

