Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శంకర్ గౌడ్ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే:కేటీఆర్

శంకర్ గౌడ్ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే:కేటీఆర్

వార్త 2 months ago

RTC Driver Shankar Goud: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇది కేవలం బలవన్మరణం కాదని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన 'హత్య' అని ఆయన అభివర్ణించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే కార్మికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

Read Also :RTC Strike:మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హౌస్ అరెస్ట్

 KTR Slams Revanth Government!

కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్

ట్విట్టర్ (X) వేదికగా కేటీఆర్ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని భరించలేకే శంకర్ గౌడ్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఒక కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఉద్రిక్తతలను గుర్తుకు తెస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ క్లిష్ట సమయంలో ఆర్టీసీ కార్మికులు ఎవరూ ధైర్యం కోల్పోవద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

నర్సంపేటలో ఆర్టీసీ సెగ..డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియల వేళ ఉద్రిక్తత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha