Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబోలో 'జార్జ్ క్రిష్' ప్రారంభం

శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబోలో 'జార్జ్ క్రిష్' ప్రారంభం

వార్త 1 week ago

Sharwanand George Krish Movie యువ హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నూతన చిత్రం శుక్రవారం ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు 'జార్జ్ క్రిష్' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. మూవీ ప్రారంభించిన రోజే విడుదల తేదీని కూడా ప్రకటించి మేకర్స్ అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. “మా చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నాం. సంక్రాంతి బరిలో దిగి హ్యాట్రిక్ విజయాలు సాధించిన చరిత్ర శర్వానంద్‌కు ఉంది. ఇప్పుడు ‘జార్జ్ క్రిష్’ చిత్రంతో ఆ విజయవంతమైన సెంటిమెంట్‌ను కొనసాగించబోతున్నాం” అని ధీమా వ్యక్తం చేశారు. శర్వానంద్‌కు గతంలో 'శతమానం భవతి', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'నారీ నారీ నడుమ మురారి' వంటి చిత్రాలు సంక్రాంతి పండుగ సీజన్‌లో అద్భుతమైన విజయాలను అందించాయి.

Read Also : Yash Toxic : సెన్సార్ పూర్తి చేసుకున్న 'టాక్సిక్'

 ‘George Krish’ launched with the Sharwanand-Srinu Vaitla combination.

Sharwanand George Krish Movie: సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా పూజా కార్యక్రమాలు

హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేయగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి షాట్‌కు క్లాప్ కొట్టారు. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల గౌరవ దర్శకత్వం వహించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఏటీవీ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభం నుంచే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రారంభోత్సవం రోజే డిస్ట్రిబ్యూటర్ల జాబితా విడుదల

ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే.. చిత్రం ప్రారంభమైన రోజే ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్ల జాబితాను ప్రకటించడం. సాధారణంగా సినిమా విడుదల సమయంలో ప్రకటించే ఈ వివరాలను తొలిరోజే విడుదల చేయడం ప్రాజెక్ట్‌పై నిర్మాతలకున్న నమ్మకాన్ని సూచిస్తోంది. ఈ చిత్రానికి కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. గోపీ మోహన్, నందు సవిరిగాన కథ, మాటలు అందిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో దర్శకుడు శ్రీను వైట్ల తిరిగి పూర్వ ఫామ్‌లోకి వస్తారని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

జైలర్-2 భారీ ధరకు ఓటీటీ రైట్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha