Sangareddy: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట్ గ్రామంలో PACS ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని కోరుతూ రైతులు ధర్నా చేపట్టారు.
ఇప్పటికే తమ వరి కోత పూర్తి చేసి 15 రోజులు గడిచినా కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం నిల్వ ఉంచడం వల్ల నష్టం జరుగుతోందని, వర్షాలు పడితే మరింత ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు తమ పంటను విక్రయించుకునేలా వెంటనే కేంద్రాన్ని ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
Sangareddy: Opening of PACS grain purchase center in Shivampet delayed… Farmers’ dharna
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :
రైతులకు తీపి కబురు.. మే 5-7 వరంగల్‌లో 50-90% సబ్సిడీ యంత్రాలు: పొంగులేటి ప్రకటన

