శివరాత్రి (Shivaratri) సందర్భంగా ఏపీలోని శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతుల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సమీక్ష నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తీసుకుంటున్న చర్యలపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో నిన్న సీఎం ఢిల్లీ నుంచే సమీక్ష చేశారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.

శ్రీశైలంలో(Shivaratri) భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న సీఎం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, అవసరమైన వసతి సదుపాయాలు అందేలా కార్యాచరణ అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
సీఎం చంద్రబాబు ఎంతో కష్టపడి ఆలయానికి వచ్చే భక్తులను ఎవ్వరూ అగౌరవంగా చూడకుండా, శివరాత్రి వంటి పర్వదినాల్లో భక్తుల రద్దీని ముందస్తుగా ప్లాన్ చేసి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సీఎం విజయానంద్‌కు ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com

