Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీచైతన్య హాస్టల్లో విద్యార్థిపై దాడి

శ్రీచైతన్య హాస్టల్లో విద్యార్థిపై దాడి

వార్త 2 weeks ago

Hyderabad : హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల హాస్టల్‌లో అత్యంత దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. క్రమశిక్షణ నేర్పించాల్సిన వార్డెనే కాలయముడిలా మారి, ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక అమాయక విద్యార్థిపై అమానుషంగా భౌతిక దాడికి పాల్పడ్డాడు.

తన సొంత ఫోన్ తీసుకొని మాట్లాడాడనే చిన్న కారణంతో ఆగ్రహంతో ఊగిపోయిన వార్డెన్ చందు, సదరు విద్యార్థిపై తీవ్రస్థాయిలో చెయ్యి చేసుకున్నాడు. వార్డెన్ బలంగా కొట్టడంతో విద్యార్థి చెవి కర్ణభేరి (Eardrum) పగిలిపోయి విపరీతంగా రక్తస్రావమైంది. విద్యార్థుల భద్రతకు, సంక్షేమానికి పూచీకత్తుగా ఉండాల్సిన హాస్టల్ ప్రాంగణంలోనే ఇలాంటి దారుణ ఘతుకం జరగడం స్థానికంగా మరియు విద్యా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

తల్లిదండ్రుల కన్నీరు.. నాచారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

ఈ దాడి విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని, తమ కుమారుడి పరిస్థితిని చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వైద్య పరీక్షల అనంతరం, వార్డెన్ చేసిన తీవ్ర దాడి కారణంగా తమ బిడ్డకు ఏకంగా 50 శాతం వినికిడి లోపం ఏర్పడిందని వైద్యులు ధ్రువీకరించడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి తమ కుమారుడి జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీసిన వార్డెన్ చందుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు నాచారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హాస్టళ్లలో విద్యార్థులపై ఇటువంటి విచక్షణారహిత దాడులు జరగకుండా కఠిన చట్టాలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సచివాలయంలో తాగునీటి తిప్పలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha